ఎన్‌కౌంటర్‌: ముగ్గురు టెర్రరిస్టులు హతం

by Shamantha N |   ( Updated:2021-05-05 20:55:57.0  )
ఎన్‌కౌంటర్‌: ముగ్గురు టెర్రరిస్టులు హతం
X

శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్‌లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు తీవ్రవాదులు హతమయ్యారు. దక్షిణ కాశ్మీర్ లోని షోపియాన్ జిల్లా కనిగమ్ ఏరియాలో ఇరు వర్గాల మధ్య జరిగిన కాల్పుల దాడిలో భద్రతా దళాలు గురువారం తెల్లవారుజామున ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. మృతులంతా అల్-బదర్‌ గ్రూపునకు చెందినవారని, భద్రతా దళాలతో జరిపిన కాల్పుల్లో ముష్కరులు హతమైనట్టు కాశ్మీర్ జోన్ పోలీస్ ట్విట్టర్ లో తెలిపింది. చనిపోయినవారంతా ఇటీవలే ఆ సంస్థకు కొత్తగా రిక్రూట్ అయ్యారు. వారంతా కనిగమ్ ఏరియాలోని ఓ ప్రాంతంలో ఉన్నారన్న పక్కా సమాచారంతో భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఇది ఇంకా కొనసాగుతున్నదని అధికారులు తెలిపారు. కాగా మే 4న బారాముల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాలు ఇద్దరు లష్కర్-ఎ-తోయిబా ఉగ్రవాదులను హతమార్చిన విషయం విదితమే.

Advertisement

Next Story