- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఒక భార్య ఇద్దరు భర్తలు.. సినిమాను తలపించిన స్టోరీ.. చిన్నారి గొంతు నులిమి..!
దిశ, ఆందోల్ : అభంశుభం తెలియని మూడేళ్ళ చిన్నారిని గొంతు నులిమి చంపాడు వరుసకు తండ్రైన ఓ కసాయి. ఈ హృదయ విదారక ఘటన మెదక్ జిల్లా టేక్మాల్ మండలం పల్వంచ గ్రామంలో కలకలం రేపింది. పల్వంచకు చెందిన బి.రమణయ్య-సావిత్రిలకు 2014లో వివాహం జరిగింది. రెండేళ్ల పాటు సాఫీగా సాగిన వీరి జీవితంలో చిన్న చిన్న కలతలు రావడంతో విడిపోయారు. ఆందోల్ మండలం రోళ్లపాడ్‌కు చెందిన సురేష్‌ను సావిత్రి రెండోసారి వివాహం చేసుకుంది. వీరికి అమ్మాయి పుట్టింది. సావిత్రి తన మాజీ భర్త అయిన రమణయ్యతో మళ్ళీ ఫోన్లు, చనువుగా మాట్లాడటం ప్రారంభించింది. ఆ తర్వాత సురేష్‌తో విబేధాలు రావడంతో అతనికి కూడా దూరం అయ్యింది సావిత్రి.
తన మాజీ భర్త రమణయ్యను మరోసారి పెళ్లి చేసుకుంది. అయితే, సావిత్రి గర్భం దాల్చగా వీరితో ఉంటున్న చిన్నారి వర్షినిని ఎలాగైనా హతమార్చాలని నిర్ణయించుకున్నాడు రమణయ్య. మంగళవారం సావిత్రిని వైద్యం కోసం వేరే బైక్ పైన పంపించి, వర్షినిని వెంట బెట్టుకొని రమణయ్య టేక్మాల్‌కు బయలుదేరాడు. మార్గ మధ్యలో చిన్నారిని (3) గొంతు నులిమి చంపేశాడు. దారిలో వాంతులు చేసుకుని చనిపోయిందని చెప్పి అందరినీ నమ్మించాడు. ఈ విషయాన్ని గ్రామస్తుల ద్వారా తెలుసుకున్న సీఐ జార్జి, ఎస్‌ఐ శ్రీకాంత్ ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అసలు విషయం తెలిసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.