- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
CM Revanth Reddy: ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణంపై నేడు సీఎం సమీక్ష

దిశ, వెబ్‌డెస్క్: నిరుపేద, మధ్య తరగతి కుటుంబాలకు అపద్బంధు అయిన ఉస్మానియా ఆసుపత్రి (Osmania Hospital) నూతన భవన నిర్మాణంపై ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10.30కి సెక్రటేరియట్‌లో జరగబోయే ఈ సమావేశానికి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ (Dana Kishore), సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి (Ajith Reddy), హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ (Anudeep), నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ (CV Anand)తో తదితరులు హాజరుకానున్నారు. అయితే, నగరంలోని గోషామహల్ (Goshamahal) పోలీస్ స్టేడియం (Police Stadium), పోలీస్ స్పోర్ట్ కాంప్లెక్స్ (Police Sports Complex)లో నిర్మించబోయే ఉస్మానియా ఆసుపత్రి (Osmania Hospital) నిర్మాణానికి సంబంధించిన సర్వే పనులను ప్రారంభించాలని ఇప్పటికే సీఎం ఉన్నతాధికారులను ఆదేశించారు. అదేవిధంగా ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (Integrated Command Control Center)లో ఎక్సైజ్ శాఖ, సాయంత్రం 5 గంటలకు విద్యుత్ శాఖల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
కాగా, గత సంవత్సరం డిసెంబర్ 1న జరిగిన సమీక్షలో భాగంగా ఆసుపత్రి నిర్మాణానికి భూమిని వైద్య, ఆరోగ్య శాఖకు బదిలీ చేయాలని అధికారులకు గతంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించిన విషయం తెలిసిందే. ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణ పనులు వేగవంతం చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేయాలని అధికారులకు సూచించారు. రాబోయే 50 ఏళ్ల కాలానికి గాను అవసరాలను అంచనా వేసి కొత్త ఆసుపత్రిని నిర్మించాలని అన్నారు. ఆసుపత్రికి నలువైపులా రహదారులు ఉండేలని అన్నారు. చికిత్స కోసం అన్ని జిల్లాల నుంచి ఆసుపత్రి వచ్చే ప్రజలకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా కనెక్టివిటీ రోడ్లను డెవలప్ చేయాలని తెలిపారు.