- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ ప్రెస్‌మీట్‌లో.. 'మీటరు' దూరం
దిశ, న్యూస్ బ్యూరో: కరోనా వ్యాప్తి నిరోధకానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించే ప్రెస్‌మీట్‌లో ‘మీటరు దూరం’ నిబంధన అమలవుతోంది. ఈ సమావేశాన్ని కవర్ చేయడానికి వచ్చిన మీడియా ప్రతినిధుల కుర్చీల మధ్య ఒక మీటరు దూరాన్ని పాటించే తరహాలో సీటింగ్ ఏర్పాట్లు జరిగాయి. ప్రతి వ్యక్తీ ‘సోషల్ డిస్టన్స్’ పాటించాలన్న నిబంధనలో భాగంగా ఒక్కో రిపోర్టర్‌కు మధ్య ఒక మీటరు దూరాన్ని పాటించే నిబంధన రూపొందించారు. మీడియా ప్రతినిధులు ప్రశ్నలు అడగడానికి ఏర్పాటు చేసిన మైక్‌ను ముందుగానే శానిటైజర్‌తో శుభ్రం చేశారు ప్రభుత్వ సిబ్బంది. ఇక ముఖ్యమంత్రి మాట్లాడే వేదికకు కూడా రిపోర్టర్లు కూర్చునే సీట్ల మధ్య దూరాన్ని గణనీయంగా పెంచారు. ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి ఇన్‌ఫెక్షన్ సోకకుండా ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఈ నెల 31 వరకు కరోనా ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో చాలా మంది స్వంత ఊర్లకు వెళ్ళడానికి సిద్ధమయ్యారు. గత వారం రోజులుగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో రద్దీ కొనసాగుతున్నా ప్రధాని ఇచ్చిన ‘జనతా కర్ఫ్యూ’ పిలుపు నేపథ్యం, వారాంతపు సెలవులు కావడంతో ఈ రద్దీ మరికొంత పెరిగింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో రెండ్రోజుల కిందట శానిటైజర్ల హడావిడి కనిపించినా శుక్రవారం సాయంత్రం నుంచి మాత్రం రద్దీ పెరగడంతో ఆ క్రమశిక్షణ గాడి తప్పింది. టికెట్ కౌంటర్ల దగ్గర సైతం రద్దీ ఏర్పడటంతో ‘మీటరు దూరం’ నిబంధన గాలికెగిరిపోయింది. ప్రగతి భవన్ ప్రెస్‌మీట్‌లో మాత్రం ఇది అమలైంది. రాష్ట్రమంతటా ఇదే విధానం అమలైతే ప్రభుత్వం ఆశించిన లక్ష్యంలో కొంతైనా నెరవేరే అవకాశం ఉంది.