- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇల్లందులో బీజేపీ, కాంగ్రెస్‌కు భారీ షాకిచ్చిన ఎమ్మెల్యే
దిశ, ఇల్లందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు భారీ షాక్ తగిలింది. ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ సమక్షంలో కాంగ్రెస్, బీజేపీల నుంచి దాదాపు 100 వంద కుటుంబాలు టీఆర్ఎస్ లో చేశారు. బుధవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరిప్రియ మాట్లాడుతూ… నియోజకవర్గ అభివృద్ధిని, టీఆర్ఎస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ పథకాలను పట్ల ఆకర్షితులై మండల పరిధిలోని ఐదు గ్రామాల నుండి వంద కుటుంబాలు టీఆర్ఎస్ పార్టీలో చేరాయని అన్నారు. ఎస్టీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు ఈసం నరసింహారావు కృషితో నియోజవర్గంలో పార్టీ బలోపేతం అవుతుందని ఎమ్మెల్యే వెల్లడించారు. అంతేగాకుండా.. టీఆర్ఎస్ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
పార్టీలో చేరిన వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. చేరిన వారిలో బీజేపీ ఎస్టీ సెల్ మండలాధ్యక్షులు సుర్ణపాక ప్రభాకర్, వైసీపీ మాజీ మండల అధ్యక్షులు ఈసం రమణ, వార్డు నెంబర్ రమాదేవి, బీజేపీ దళిత మోర్చా జిల్లా నాయకుడు ముత్యాల సురేష్, సనప వెంకటేశ్వర్లు, పూనం లాలయ్య, సువర్ణపాక శంకర్, సనపా ప్రసాద్‌లు చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ఉమాదేవి, మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పులిగండ్ల మాధవరావు, బయ్యారం ఎంపీపీ చేపూరి మౌనిక పాల్గొన్నారు.