పంచాయతీ ట్రాక్టర్ బోల్తా.. ఒకరు మృతి

by Shyam |
పంచాయతీ ట్రాక్టర్ బోల్తా.. ఒకరు మృతి
X

దిశ, మహబూబ్‌నగర్: గ్రామ పంచాయతీ ట్రాక్టర్ బోల్తాపడి ఒకరు మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన వనపర్తి జిల్లా అమరచింత మండలం చంద్రగఢ్ గ్రామంలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామంలో పంచాయతీ ట్రాక్టర్‌తో పనులు చేస్తుండగా ట్రాక్టర్ పల్టీ కొట్టింది. దీంతో ట్రాక్టర్ మీద ఉన్న ముగ్గురు వ్యక్తులు బండి కింద పడిపోయారు. వీరిలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వారిని హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఘటన‌కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags: One man died, under, panchayat tractor, mahabubnagar

Next Story