ఫెరారీ కారు ఓవర్ స్పీడ్.. ఎగిరిపడ్డ పాదాచారుడు

by Shyam |
ఫెరారీ కారు ఓవర్ స్పీడ్.. ఎగిరిపడ్డ పాదాచారుడు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌ మాదాపూర్‌ అయ్యప్ప సొసైటీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం మధ్యాహ్నం ఫెరీరా కారు ఓవర్ స్పీడ్‌తో దూసుకొచ్చి రోడ్డుపక్కన నడుచుకుంటున్న వెళ్తున్న ఇద్దరు పాదాచారులను ఢీకొట్టడంతో ఓ వ్యక్తి గాల్లోకి లేచి కిందపడి అక్కడకక్కడే దుర్మరణం చెందాడు. మరో వ్యక్తి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని ఆస్పత్రికి తరలించారు. కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story