- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెడ్ జోన్‌లో.. ఫస్ట్ డే ఆన్‌లైన్ టాప్ ఆర్డర్స్ ఇవే!
దిశ, వెబ్ డెస్క్: కరోనా కట్టడికి.. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను మే 31 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. ఇప్పటికే గ్రీన్, ఆరెంజ్ జోన్లలో నాన్ ఎసెన్షియల్ ప్రొడక్ట్స్ డెలివరీకి అనుమతినిచ్చిన కేంద్రం తాజాగా రెడ్ జోన్లలో కూడా డెలివరీ చేసుకోవచ్చని ప్రకటించడంతో ఆయా ఈ-కామర్స్ సైట్లకు ఆర్డర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో లాక్‌డౌన్ 4.0 మొదటి రోజు స్నాప్ డీల్ ఈ కామర్స్ సైట్‌కు రెడ్ జోన్ల నుంచి 65 శాతం ఆర్డర్లు వచ్చాయని ఆ సంస్థ వెల్లడించింది.
లాక్‌డౌన్‌కు ముందు ఆన్‌లైన్‌లో ఆర్డర్లు చేసిన ప్రొడక్ట్స్ డెలివరీకాని సంగతి తెలిసిందే. వాటి గురించి చాలా మంది ఎంక్వైరీ చేయడంతో పాటు కొత్త ఆర్డర్లు కూడా పెట్టారు. ఈ క్రమంలో ఒక్కొక్కరు మూడు నుంచి నాలుగు ప్రొడక్ట్‌లు ఆర్డర్ చేసినట్లు ఆయా ఈ కామర్స్ సైట్ నిర్వాహకులు తెలిపారు. ఆదివారం నుంచి గంట గంటకు ఆర్డర్ల సంఖ్య పెరుగుతూ వచ్చిందని వెల్లడించారు. ప్రధానంగా ఢిల్లీ, ముంబై, పుణే, బెంగళూరు, పాట్నా, చంఢీగర్, అహ్మదాబాద్, సూరత్, వడోదర, జైపూర్, కోట, హైదరాబాద్, లక్నో, ఇండోర్, కోల్‌కతా తదితర నగరాల నుంచి ఆర్డర్లు ఎక్కువగా వచ్చాయని తెలిపారు.
టాప్ ఆర్డర్స్:
– బడ్జెట్ ఫోన్స్, స్మార్ట్ ఫోన్స్ (4000-8000)లతో పాటు, ఫీచర్ ఫోన్స్ అత్యధికంగా ఆర్డర్ చేశారు.
– హోమ్ గుడ్ అప్లయన్స్ కొనుగోలుకు నెటిజన్లు ఎక్కువ ఆసక్తి చూపించారు. ప్రెషర్ కుక్కర్స్, పుడ్ ప్రాసెసర్స్, వాటర్ బాటిల్స్, ఫుడ్ కంటెయినర్స్, బెడ్ షీట్స్, టవల్స్, మాప్స్, బకెట్స్ తదితర ఆర్డర్లు ఎక్కువగా ఉన్నాయి.
– ట్రిమ్మర్స్, పర్సనల్ గ్రూమింగ్ సప్లయ్స్
– టీ షర్ట్స్, షార్ట్స్, సన్ గ్లాసెస్, ఫుట్‌వేర్, వెయిట్స్
– చిల్డ్రన్స్ క్లాతింగ్
– మానిటర్స్, కీబోర్డ్స్, ఎక్స్ టెన్షన్ కార్డ్స్, ఎక్స్ టర్నల్ హార్డ్ డిస్క్
– మాస్క్, ఫేస్ షీల్డ్స్, శానిటైజర్స్, హెర్బల్ ఇమ్యూనిటీ బూస్టర్స్