- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
90 ఏళ్ల బామ్మ వీడియోగేమ్ యూట్యూబర్
వీడియోగేమ్‌లను యూట్యూబ్‌లో స్ట్రీమింగ్ చేయడం ద్వారా ఎంతో మంది గేమర్లు డబ్బులు సంపాదించుకుంటున్నారు. అయితే వీళ్లందరికీ డబ్బు సంపాదించడం కంటే గేమింగ్ చాలా ముఖ్యం. ఎందుకంటే ఒకసారి వీడియో గేమింగ్ మీద ఆసక్తి పుడితే ఇక వదిలిపెట్టడం కష్టం. జపాన్‌కు చెందిన ఓ 90 ఏళ్ల వృద్ధురాలికి కూడా వీడియో గేమ్‌లంటే పిచ్చి. ఆ పిచ్చితోనే ఇంత వయసులోనూ కుర్రాళ్లకు దీటుగా యూట్యూబ్‌లో తన వీడియో గేమ్‌లను స్ట్రీమ్ చేస్తూ అత్యంత పెద్ద వయస్కురాలైన యూట్యూబ్ గేమర్‌గా గిన్నిస్ రికార్డుకెక్కింది.
ఇంతకీ పేరు చెప్పలేదు కదూ! ఆమె పేరు హమకో మోరి. అభిమానులు ముద్దుగా ‘గేమర్ గ్రాండ్‌మా’ అని పిలుచుకుంటారు. ఆమె యూట్యూబ్ ఛానల్‌కు 2,50,000 మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. 39 ఏళ్ల క్రితం ఆమెకు మొదటిసారిగా వీడియో గేమ్‌ల మీద ఆసక్తి కలిగింది. ఆ ఆసక్తితోనే 2015లో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించింది. ఒక నెలలో నాలుగు వీడియోలను పోస్ట్ చేసే ఈ వృద్ధురాలు.. ఆ వీడియోల్లో కన్సోల్ వీడియోల అన్‌బాక్సింగ్ నుంచి తన గేమింగ్ నైపుణ్యాల వరకు అన్నీ ప్రదర్శిస్తోంది.