- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోరిక తీర్చలేదని.. వృద్ధురాలిని చంపి, మూడు ముక్కలు చేసి
దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుత సమాజంలో కొంతమంది మగాళ్లు, మృగాళ్ళుగా మారుతున్నారు. వావి వరుస, చిన్నా,పెద్ద తేడా మరిచి కామ పిశాచులుగా తయారవుతున్నారు. తాజాగా తన కోరిక తీర్చలేదని ఒక వృద్ధురాలిని అతి కిరాతకంగా నరికి చంపాడు ఒక దుర్మార్గుడు. అంతేకాకుండా ఆమె శరీరాన్ని ముక్కలు, ముక్కలుగా చేసి రైల్వే ట్రాక్ పై పడేశాడు. ఈ దారుణ ఘటన ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం లో వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే.. కారేపల్లి మండలం బజ్యాతండాకు చెందిన వృద్ధురాలు అజ్మీర నాజీ(70 ) మతిస్థిమితం కోల్పోయి రోడ్ల మీద తిరుగుతూ ఉండేది. ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలిపై అదే కాలనీకి చెందిన ఉపేందర్ కన్ను పడింది.
గత కొంత కాలంగా ఉపేందర్ ఆమెపై అత్యాచారం చేసేందుకు యత్నించాడు. ఈ విషయం వృద్ధురాలి కాలనీలో తెలిసిన వాళ్లందరికీ తెలిపింది. ఈ విషయమై వారు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వృద్ధురాలిపై కక్ష పెంచుకున్న ఉపేందర్ రెండు రోజుల క్రితం వృద్ధురాలిని ఆమె ఇంట్లోనే హత్య చేశాడు. అనంతరం సోమవారం రాత్రి ఆమె తల, మొండెం వేరుచేసి ఒక బస్తాలో పెట్టి వేరే యువకుడి సహాయంతో రైల్వే ట్రాక్ పై పడేశాడు. అయితే అతనిపై అనుమానమొచ్చిన యువకుడు బస్తా తెరిచి చూడగా వృద్ధురాలి మొండెం కనిపించింది. దీంతో భయపడిన యువకుడు పోలీసులకు సమాచారం అందించాడు.
రంగంలోకి దిగిన పోలీసులు ఉపేందర్ ని అరెస్ట్ చేశారు. కాగా..తాను లైంగిక వాంఛ తీర్చమని అడిగితే తిరస్కరించినందుకే హత్య చేశానని, శవాన్ని మాయం చేసేందుకే ఇలా చేశానని పోలీసుల ఎదుట నిందితుడు ఒప్పుకున్నాడు. అయితే వృద్ధురాలిని క్షుద్ర పూజల కోసమే చంపేశారని తండా ప్రజలు చెప్తున్నారు. ఉపేందర్ తోపాటు మరి కొందరు కూడా హత్యలో పాలు పంచుకుని ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.