- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కూతురిని సాగనంపేందుకు వెళ్లి తిరిగిరాని తండ్రి..
by Sumithra |

X
దిశ, కుత్బుల్లాపూర్ : కూతురిని సాగనంపేందుకు వెళ్లిన వృద్దుడు అదృశ్యమైన ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఆలస్యంగా వెలుగుచూసింది. సీఐ బాలరాజు కథనం ప్రకారం.. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కాట్రపల్లి గ్రామానికి చెందిన పేట నర్సప్ప(65) గత నెల 30న గాజుల రామారం చంద్రగిరి నగర్‌లో ఉండే కొడుకు నాగరాజు ఇంటికి బోనాల పండుగ కోసం వచ్చాడు.
అయితే, 4వ తేదీన ఉదయం కుమార్తెను ఊరికి పంపించేందుకు షాపూర్ నగర్ బస్టాండ్‌కు వచ్చి బస్సు ఎక్కించాడు. సాయంత్రం అవుతున్నా తిరిగి ఇంటికి రాకపోవడంతో ఫోన్ చేయగా వస్తున్నాడని చెప్పాడు. మరికొద్ది సేపటి తర్వాత కాల్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. పరిసర ప్రాంతాల్లో వెతికినా ప్రయోజనం లేదు. నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
Next Story