- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కూకట్‌పల్లి కాల్పుల కేసులో పురోగతి..
by Sumithra |

X
దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ మహానగరంలోని కూకట్ పల్లిలో గురువారం ఉదయం జరిగిన కాల్పుల ఘటనలో పోలీసులు పురోగతి సాధించారు. హెచ్డీఎఫ్ బ్యాంక్ ఏటీఎంలో నగదు నింపుతుండగా గుర్తుతెలియని దుండగులు అకస్మాత్తుగా కాల్పులు జరిపి రూ.5లక్షల నగదు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో సెక్యూరిటీ మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.
అయితే, సాయంత్రానికి ఈ కేసులో పురోగతి సాధించినట్లు తెలుస్తోంది.15 రోజుల కిందట జీడిమెట్లలో బ్యాంక్ దొంగతనానికి పాల్పడ్డ ముఠానే ఏటీఎమ్ చోరీకి యత్నించినట్లు గుర్తించారు. ప్రస్తుతం నిందితుల కోసం పోలీసుల వేట కొనసాగుతున్నట్లు సమాచారం.
Next Story