OLA న్యూ రికార్డు.. సెకనుకు 4 స్కూటర్లు విక్రయం

by Harish |   ( Updated:2021-09-16 03:35:53.0  )
OLA న్యూ రికార్డు.. సెకనుకు 4 స్కూటర్లు విక్రయం
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఓలా తన మొదటి ఈ-స్కూటర్ విక్రయాల్లో రికార్డు సాధించింది. గతవారం వెబ్‌సైట్‌లో లోపాల కారణంగా ఈ-స్కూటర్ అమ్మకాలను వాయిదా వేసిన సంస్థ బుధవారం కొనుగోళ్లను ప్రారంభించింది. ప్రత్యేకంగా ఓలా యాప్‌లో ఆయా మోడళ్లను కొనవచ్చు. ఈ ప్రక్రియ పూర్తిగా డిజిటల్ రూపంలో నిర్వహిస్తున్నారు. ఇప్పటికే దేశీయ మార్కెట్లో పలు ఎలక్ట్రానిక్ స్కూటర్లు, బైకులు వచ్చినప్పటికీ ఓలా తనకంటూ ప్రత్యేక ఆదరణను సాధించింది. ఈ క్రమంలో బుధవారం జరిగిన అమ్మకాల్లో కేవలం 24 గంటల్లో రూ. 600 కోట్ల విలువైన స్కూటర్లను విక్రయించినట్టు సంస్థ సీఈఓ భవీష్ అగర్వాల్ చెప్పారు.

ప్రతీ సెకనుకు 4 ఈ-స్కూటర్లను విక్రయించామని ఆయన పేర్కొన్నారు. ఈ స్పందన తమ అంచనాలకు మించి జరిగింది. రాబోయే నెలల్లో ఉత్పత్తి ప్రణాళికలను బట్టి వినియోగదారులు తమ ఓలా ఎస్1, ఎస్1 ప్రో స్కూటర్లను కొనేందుకు రిజర్వ్ చేసుకున్నవారికి గురువారం చివరిరోజని భవిష్ అగర్వాల్ తెలిపారు. భారత్‌లో టూ-వీలర్ ఎలక్ట్రిక్ వాహనాలకు భారీగా డిమాండ్ ఉంది. దేశీయంగా మార్కెట్ సైతం అదే స్థాయిలో ఉంది. అంతేకాకుండా ప్రపంచ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కేంద్రంగా మార్చేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటామని భవిష్ అగర్వాల్ వెల్లడించారు.

Advertisement

Next Story