- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డ్రైవర్లను ఆదుకుంటున్న ఓలా!
దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో అనేకమందికి ఉపాధి లేకుండా పోయింది. దేశవ్యాప్తంగా 21 రోజుల వరకు లాక్‌డౌన్ ప్రకటించడంతో లక్షల మంది తమ ఉద్యోగాలను పోగొట్టుకోవడంతో పాటు కొందరు ఆదాయాన్ని కోల్పోనున్నారు. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ప్రముఖ క్యాబ్ సర్వీసుల సంస్థ ఓలా తమ ఉద్యోగులకు అండగా నిలబడింది. వైరస్ వ్యాప్తి, లాక్‌డౌన్ కారణంగా ఆదాయాన్ను కోల్పోయిన డ్రైవర్లకు ‘డ్రైవ్ ది డ్రైవ్ ఫండ్’ అనే నిధిని ప్రకటించింది. దీనికి సంబంధించిన వివరాలను ఓలా సహ వ్యవస్థాపకుడు భవీస్ వెల్లడించారు. భవీష్ తన ఆదాయాన్ని డ్రైవర్ల శ్రేయస్సు కోసం ఇవ్వనున్నట్టు ప్రకటించారు. అలాగే ఉద్యోగులందరికీ సాయంగా ఉండేందుకు క్రౌడ్ ఫండింగ్ చేసి రూ. 50 కోట్ల వరకూ సేకరించాలని సంకల్పించినట్టు ఆయన చెప్పారు.
ప్రధానంగా సంక్షోభం వల్ల అవసరమైన సామాగ్రి, వైద్య సేవలకు చర్యలు చేపడతామన్నారు. ఉద్యోగుల బిడ్డల చదువుకు అవసరమయ్యే ఆర్థిక సాయాన్ని చేసేందుకు ప్రయత్నిస్తామని భవీష్ చెప్పారు. తమ సంస్థకు పునాదులైన డ్రైవర్ల సంక్షేమమే మాకు కావాలి. వారు ఆదాయం లేక ఇబ్బందులు పడితే కష్టంగా ఉంటుందని, వారిని అన్ని విధాలా ఆదుకునేందుకే ఈ నిధిని ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు. ఇదివరకే ఓలా సంస్థ డ్రైవర్ల కోసం కోవిడ్-19 ఇన్సూరెన్స్ కవరేజీని ప్రకటించింది. ఇక, డ్రైవర్ల లీజ్ రెండ్‌లను, ఈఎంఐలను మాఫీ చేయాలని ఓలా అనుబంధ సంస్థ ఫ్లీట్ టెక్నాలజీస్ స్పష్టం చేసింది.
Tags : Coronavirus, Coronavirus Lockdown, 21-Day Lockdown, Ola, Ola CEO, Bhavish Agarwal, Ola Drive The Driver Fund, Ola Fleet, Ola Crowdfunding