- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పలచబడిన నూనె!
దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ఆయిల్ ఉత్పత్తి ఎగుమతులకు కష్టాలు మొదలయ్యాయి. ఫిబ్రవరి నెల ఆయిల్ ఎగుమతులు 76,017 టన్నులుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే ఫిబ్రవరి నెలతో పోల్చుకుంటే 74 శాతం తగ్గిందని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా వెల్లడించింది.
2019 ఏప్రిల్ నుంచి 2020 ఫిబ్రవరి వరకూ మొత్తం నూనె ఎగుమతులు 22,00,690 టన్నులు. అంతకుముందు ఏడాది 2018 ఏప్రిల్ నుంచి 2019 ఫిబ్రవరి మధ్య 29,41,971 టన్నులతో పోలిస్తే 25 శాతం క్షీణించింది. దేశీయంగా వినియోగం పెరగడంతో ఎగుమతులు తగ్గాయి. ఆయిల్ ధరలు పెరగడం కూడా మరో కారణం. అయితే, సేంద్రీయ ఎరువులకు ఉపయోగించే ఆముదం ఎగుమతుల్లో కూడా కాస్త పెరుగుదల నమోదవడం గమనార్హం. గతేడాది ఆముదం ఎగుమతులు 3,59,351 టన్నులుండగా, ఈ ఏడాది 41 శాతం పెరిగి 5,05,194 టన్నులకు చేరుకున్నాయి.
2019 ఏప్రిల్ నుంచి 2020 ఫిబ్రవరి మధ్య కాలంలో వియత్నాం 2,76,655 టన్నుల నూనెను దిగుమతి చేసుకుంది. అంతకుముందు ఏడాదిలో 5,92,697 టన్నుల దిగుమతులు నమోదయ్యాయి. ఈ ఏడాది దిగుమతుల్లో సోయా బీన్ 6,417 టన్నులుండగా, ఆవ నూనె 1,67,643 టన్నులు దిగుమతులు జరిగాయి. దక్షిణ కొరియా 51,098 టన్నుల సొయాబీన్, 3,65,243 టన్నుల ఆవ నూనె, 3,93,392 టన్నులలతో మొత్తం 8,09,733 టన్నుల నూనెను దిగుమతి చేసుకుంది. థాయ్‌లాండ్ 1,97,798 టన్నుల ఆవ నూనె, 17,581 టన్నుల తవుడు నూనె, 2,905 టన్నుల సోయాబీన్‌తో కలిపి మొత్తం 2,18,320 టన్నుల నూనెను దిగుమతి చేసుకుంది.
Tags: Oilmeal exports, down 74 percent, export, india export