భారీగా తగ్గిన చమురు ధరలు!

by Harish |
భారీగా తగ్గిన చమురు ధరలు!
X

దిశ, వెబ్‌డెస్క్ : అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పడిపోయాయి. బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర ఏకంగా 23 డాలర్లకు పడిపోయింది. 2002 ఏడాది తర్వాత ఇంత కనిస్ఠ స్థాయికి పడిపోవడం తొలిసారి. అయితే, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు 18 ఏళ్ల కనిస్ఠానికి దిగజారినా సరే దేశీయంగా ప్రయోజనాలు వినియోగదారులకు అందకపోవడం విషాదం. ఈ ప్రయోజనాలు వినియోగదారులకు అందకపోవడానికి కేంద్రం ఇటీవల ఎక్సైజ్ పన్ను పెంపుకు చెల్లించడం వల్లే అని దేశీయంగా ఉన్న చమురు కంపెనీలు చెబుతున్నాయి.

కేంద్రం పెంచిన ఎక్సైజ్ పన్ను వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు రూ. 3 వరకూ పెరిగే అవకాశముంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఎంత దిగజారినా..దేశీయంగా మాత్రం పెట్రో ఉత్పత్తుల ధరలు సాధారణంగానే ఉన్నాయి. చివరగా మార్చి రెండో వారంలో కంపెనీలు ధరలు మార్పులు చేశాయి. ప్రస్తుతం ఉన్న ధరలను గమనిస్తే…దేశ రాజధానిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 69.59, డీజిల్ రూ. 62.59 ఉంది. ముంబైలో పెట్రోల్ రూ. 75.30, డీజిల్ రూ. 65.21 ఉండగా, పెంచిత ఎక్సైజ్ పన్ను పెంచడం ద్వారా పెట్రోల్ లీటర్‌కు రూ. 23, డీజిల్ రూ. 19 వరకూ పెరిగింది.

Tags : crude oil, Oil drops, petrol prices

Advertisement

Next Story

Most Viewed