- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మత్స్యకారులను కాపాడిన అధికారులు….
దిశ, మెదక్:
చేపల వేటకు వెళ్లి మంజీరా నది వరద ప్రవాహంలో చిక్కుకు పోయిన మత్స్యకారులను అధికారులు బుధవారం రక్షించారు. వివరాల్లోకి వెళితే.. మెదక్ జిల్లా కొల్చారం మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన దుంపల ఎల్లం, సాదుల యాదగిరి, మెదక్ పట్టణానికి చెందిన స్కైలాబ్, నాగరాజులు హనుమాన్ బండలో చేపల వేటకు వెళ్లారు. ఒక్కసారిగా వరద పెరగడంతో వారు నదిలోనే చిక్కుకున్నారు. బయటకు రావడానికి వీలు లేకపోవడంతో విషయాన్ని తమ బంధువులకు ఫోన్ చేసి తెలిపారు. దీంతో పోలీసులను వారు ఆశ్రయించారు. దీనిపై కొల్చారం ఎస్సై శ్రీనివాస్ గౌడ్ వెంటనే స్పందించారు. ఈ విషయాన్నిఉన్నతాధికారుల దృష్టికి ఆయన తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన నర్సాపూర్ ఇంఛార్జ్ ఆర్డీఓ సాయిరాం అక్కడికి చేరుకుని దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. నదీ పాయల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు గాను సింగూర్ ప్రాజెక్టు అధికారులతో మాట్లాడి గేట్లను మూయించారు. అనంతరం గజ ఈతగాళ్ల సహాయంతో నలుగురిని ఒడ్డుకు చేర్చారు. కాగా మత్స్యకారులు క్షేమంగా ఒడ్డుకు చేరుకోవడంతో వారి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.