- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైల్వే కూలీలకు అధికారుల సాయం
దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా మహమ్మారి ప్రభావంతో ఉపాధి కోల్పోయిన రైల్వే కూలీలలకు సహాయ సహకారాలు అందించడానికి రైల్వే శాఖ ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటుందని దక్షిణ మధ్య రేైల్వే జోనల్ ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ జి. జాన్ ప్రసాద్ అన్నారు. జోనల్ కమర్షియల్ విభాగం అధికారులు, సిబ్బందితో కలిసి కాచిగూడ రైల్వే స్టేషన్ కూలీలకు బియ్యం, పప్పు, నూనెలు, పిండి, ఉప్పు, సబ్బులు, శానిటైజర్లు ఇతర వంట సరుకులతో పాటు కొంత డబ్బును జాన్ ప్రసాద్ ఆధ్వర్యంలో శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కారణంగా రైళ్లన్నీ రద్దవడంతో నడుస్తున్న స్పెషల్ రైళ్లలో కాచిగూడ స్టేషన్ నుంచి ఒక్క రైలు కూడా వెళ్లడం లేదని, దీంతో స్టేషన్‌లోని కూలీలు పూర్తిగా ఉపాధి కోల్పోయారన్నారు. ఈ పరిణామంతో చలించిపోయిన కమర్షియల్ విభాగం అధికారులు, సిబ్బంది ఆపన్న హస్తం అందించేందుకు ముందుకు రావడంతో కొంత డబ్బు సేకరించి కూలీలను ఆదుకోవాలని నిర్ణయించామని తెలిపారు. రైల్వేశాఖ నిర్ణయించిన ధరలకు రైల్వే స్టేషన్‌లలో ప్రయాణికుల లగేజీని మోస్తూ జీవనం సాగించే రైల్వే కూలీలకు ఇలాంటి పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు. కూలీలు కరోనా కష్ట కాలంలో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలని కోరారు. మాస్కులు, శానిటైజర్లు వాడుతూ తగు జాగ్రత్తలు తీసుకుంటూ కరోనా నుంచి తమను తాము కాపాడుకోవాలని సూచించారు. రైల్వే కూలీలకు సహాయం చేయడానికి ముందుకు వచ్చిన కమర్షియల్ విభాగం అధికారులు, సిబ్బందిని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య ప్రశంసించారు.