- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భూపాలపల్లిలో సంచలనంగా మారిన ‘సర్పంచ్’ ఆడియో లీక్ వ్యవహరం
దిశ, కరీంనగర్ : సరిగ్గా 24 రోజుల క్రితం ఆ సర్పంచ్ గ్రామంలో చేసిన అభివృద్ధి పనుల బిల్లుల రాక అప్పుల పాలయ్యానంటూ ఓ ఆడియోను విడుదల చేశారు. నేడు ఆ సర్పంచ్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు అధికారులు. భూపాలపల్లి జిల్లా కాటారం మండలం రేగుల గూడెం గ్రామ సర్పంచ్ డి. రాహుల్ శనివారం అధికారుల నుంచి ఈ మేరకు సస్పెన్షన్ ఉత్తర్వులు అందుకున్నారు. ఆరు నెలల పాటు సస్పెండ్ చేస్తున్నామని పంచాయితీరాజ్ చట్టం ప్రకారం 30 రోజుల్లోగా ట్రిబ్యూనల్‌లో అప్పీల్ చేసుకోవాలని జిల్లా అధికారులు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
ఆడియో తెచ్చిన తంటా..
సర్పంచ్ రాహుల్ విడుదల చేసిన ఆడియోలో అధికారులు టార్చర్ చేస్తున్నారు, బిల్లులు రావడం లేదు, అప్పులు తెచ్చి పనులు చేసినా బిల్లులు రాకుంటే ఇక చావే శరణ్యమని.. తాను రూ. 15 లక్షల అప్పులు తెచ్చి పనులు చేపట్టానని అందులో వివరించారు. జూన్ 6న విడుదల చేసిన ఆడియోను విన్న అధికారులు అతనిపై జిల్లా అధికారులకు నివేదిక అందించారు. జూన్ 7 నాటికి గ్రామంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల కోసం రూ. 22 లక్షల పై చిలుకు నిధులు మంజూరు చేశామని ఆ నివేదికలో స్పష్టం చేశారు. అయితే, రేగులగూడెం సర్పంచ్ పల్లె ప్రగతి పనులు పూర్తి చేయకుండానే అధికారులపై తప్పుడు ఆరోపణలు చేశారని గుర్తించినట్టు వివరించారు. ఈ మేరకు అతనికి షోకాజ్ నోటీసు ఇచ్చిన అధికారులు అతన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.