- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆలయంలో ఉద్యోగుల ఇష్టారాజ్యం.. కమీషన్ల కక్కుర్తి..
దిశ ప్రతినిధి, వరంగల్ : కురవి వీరభద్ర స్వామి ఆలయంలో ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బ్రహ్మోత్సవాలను బ్రహ్మాండగా నిర్వహిస్తున్నామని చెబుతూ.. స్వామి వారి ఖజానాను ఖాళీ చేసే పనిలో నిమగ్నమైనట్లు పలువురు ఆరోపిస్తున్నారు. పనులు దక్కేలా చేస్తే కాసులు కేటాయిస్తున్నారని తెలుస్తోంది. సౌకర్యాలు, అవసరాల పేరుతో దుబారా ఖర్చే అధికమవుతోందని భక్తులు పేర్కొంటున్నారు. దీనికి తోడు అదనపు చెల్లింపులతో ఊడ్చి పెట్టి తతంగం నడుస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చాలా కార్యకలాపాలు లెక్కా పత్రం లేకుండానే సాగుతున్నాయని, అనేక వాటిల్లో ఫేక్ బిల్లులను సృష్టించి మరీ దోచేస్తున్నట్లుగా తెలుస్తోంది.
సీఈవో రవీందర్‌దే ఫైనల్?
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన దేవాదాయశాఖ అధికారి రవీందర్ కొద్దిరోజుల క్రితం కురవి ఆలయంలో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్నారు. ఆయన వచ్చినప్పటి నుంచి ఆలయంలో జరుగుతున్న కార్యకలాపాల్లో అక్రమాలు, అవినీతి జరుగుతోందన్న ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. గుడిలో కూడా ఆయన ప్రవర్తన భిన్నంగా ఉంటుందని భక్తులు ఆరోపిస్తున్నారు. దేవాలయ అభివృద్ధి పేరిట కమీషన్లకు కక్కుర్తిపడి అనవసరమైన పనులకు టెండర్ పిలుస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సీఈవోకు నచ్చితే చాలు నియమ నింబధనలతో సంబంధం లేకుండానే పనులన్నీ జరుగుతున్నట్లుగా కొంతమంది భక్తులు చెబుతున్నారు.