దిశ ఎఫెక్ట్.. తొలిగిన ముళ్ల పొదలు.. ఆనందంలో వాహనదారులు

by Shyam |
దిశ ఎఫెక్ట్.. తొలిగిన ముళ్ల పొదలు.. ఆనందంలో వాహనదారులు
X

దిశ, ములుగు: దిశ కథనానికి అధికారులు స్పందించారు. ఈ నెల 20వ తేదీన అనగా సోమవారం రోజున దిశ దినపత్రికలో ముళ్లపొదల్లో ప్రమాదం అని ప్రచురింపబడ్డ వార్తలను గమనించిన అధికారులు మంగళవారం జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న ముళ్ల పొదలను తొలగించే కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా ట్రాక్టర్ సహాయంతో రహదారికి ఇరువైపులా ఉన్న పొదలను తొలగించారు. పొదలను తొలగించడంతో వాహనదారులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story