- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సెమీకండక్టర్ల కొరతతో దెబ్బతిన్న ప్యాసింజర్ వాహన అమ్మకాలు!
దిశ, వెబ్‌డెస్క్: సెమీకండక్టర్ల కొరత, ఇన్‌పుట్ ఖర్చుల పెరుగదల కారణంగా అక్టోబర్ నెలలో దేశీయ ప్యాసింజర్ వాహనాల టోకు విక్రయాలు దెబ్బతిన్నాయి. గతేడాదితో పోలిస్తే 27 శాతం క్షీణత నమోదైనట్టు వాహన తయారీదార్ల సంఘం(సియామ్) తెలిపింది. సమీక్షించిన నెలలో మొత్తం 2,26,353 యూనిట్ల వాహనాలు అమ్ముడవగా, గతేడాది ఇదే నెలలో 3,10,294 యూనిట్ల విక్రయాలు నమోదైనట్టు సియామ్ పేర్కొంది. మొత్తం విక్రయాల్లో టూ-వీలర్ అమ్మకాలు 25 శాతం తగ్గి 15,41,621 యూనిట్లుగా నమోదయ్యాయి. త్రీ-వీలర్ అమ్మకాలు 21.33 శాతం పెరిగి 31,774 యూనిట్లుగా నమోదయ్యాయి.
జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి ప్యాసింజర్ వాహనాల టోకు అమ్మకాలు 7,26,232 యూనిట్లతో 2 శాతం పడిపోయాయి. సమీక్షించిన త్రైమాసికానికి సంబంధించి టూ-వీలర్ వాహనాల టోకు విక్రయాలు 41,13,915 యూనిట్లతో 12 శాతం తగ్గాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు తగ్గినప్పటికీ పండుగ సీజన్‌లో పెరుగుతాయని కంపెనీలు భావించాయి. అయితే, ప్రధానంగా ఉత్పత్తికి అవసరమైన సెమీకండక్టర్ల కొరతతో పాటు ఇన్‌పుట్ ఖర్చులు పెరగడం ప్రతికూలంగా మారిందని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ అన్నారు.