- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
భారత్ బుకీలు.. శ్రీలంక క్రికెటర్లు
దిశ, స్పోర్ట్స్: ఏ రంగంలో అయినా ఈజీ మనీ వస్తుందంటే కాదనే వాళ్లు చాలా తక్కువ మందే ఉంటారు. అడ్డదారిలో భారీగా సంపాదించే వ్యక్తులు ఎక్కడైనా కనపడుతూనే ఉంటారు. అలా అక్రమ సంపాదనకు క్రీడా రంగం కూడా అతీతం ఏమీ కాదు. క్రికెట్‌ను ఫిక్సింగ్ జాఢ్యం ఎప్పటి నుంచో పట్టి పీడిస్తున్నది. అవినీతి భారీగా పెరిగిపోతుండటంతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) దానిపై నిఘా ఉంచడానికి యాంటీ కరప్షన్ యూనిట్‌ను ఏర్పాటు చేసింది. గత పదేళ్లుగా ఏసీయూ అనేక మంది క్రికెటర్లు, కోచ్‌లు, బుకీలపై నిఘా పెట్టింది. గతంలో దుబాయ్, పాకిస్తాన్ వంటి దేశాల్లో బుకీలు ఎక్కువగా ఉండేవారు. అయితే గత నాలుగైదు ఏళ్లుగా ఇండియా కేంద్రంగా బుకీలు మ్యాచ్‌లను ఫిక్స్ చేస్తున్నట్లు గుర్తించారు. యూఏఈలో 2017లో జరిగిన టీ10 లీగ్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో మొదలైన విచారణ ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలను వెలుగులోకి తెచ్చింది. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచాన్ని ఏలుతున్న బుకీలలో ప్రధాన వ్యక్తి ఇండియాకు చెందిన వాడే అని గుర్తించారు. ఎంతో మంది క్రికెటర్లు, కోచ్‌లను ప్రలోభపెట్టడానికి ప్రయత్నించినట్లు తెలుస్తున్నది.
కింగ్‌పిన్ ఇక్కడి వాడే..!
ఐసీసీ గత కొన్ని నెలలుగా మ్యాచ్ ఫిక్సింగ్‌కు సంబంధించిన విచారణను వేగవంతం చేసింది. ఇండియాకు చెందిన ఒక వ్యక్తి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లతో పాటు టెన్నిస్ మ్యాచ్‌లను కూడా ఫిక్స్ చేసినట్లు విచారణలో తెలిసింది. అంతే కాకుండా ఒక ఫాంటసీ లీగ్ సంస్థతో కలసి అనధికార క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించినట్లు తెలుస్తున్నది. శ్రీలంకలో మినీ లీగ్ జరుగుతున్నదని యాప్ ద్వారా ప్రసారం చేసి భారీగా డబ్బులు దండుకున్నారు. అయితే ఆ లీగ్ పంజాబ్‌లోని ఒక క్లబ్‌కు చెందిన మైదనాంలో నిర్వహించినట్లు తర్వాత తెలిసింది. ఫాంటసీ లీగ్ సంస్థ ద్వారా డబ్బులు సంపాదించడమే కాకుండా.. ఆ మ్యాచ్‌లను ఫిక్స్ చేసి భారీగా అక్రమ ఆదాయం పొందారని విచారణలో వెల్లడైంది. ఇందుకు సూత్రధారి ఒక్కడే అని సమాచారం. అతడే ప్రపంచ వ్యాప్తంగా తన వ్యక్తులను పెట్టుకొని క్రికెటర్లను ప్రలోభపెట్టడానికి ప్రయత్నించినట్లు తెలిసింది.
శ్రీలంక క్రికెటర్లే ఎక్కువ..
ఇండియాకు చెందిన ఫిక్సింగ్ ముఠా నాయకుడు ఎక్కువగా శ్రీలంకకు చెందిన క్రికెటర్లకే వల వేశాడు. ఈ విషయాన్ని ఐసీసీ జనరల్ మేనేజర్ అలెక్స్ మార్షల్ తెలిపారు. 2017లో యూఏఈలో జరిగిన టీ10 లీగ్ ఆడటానికి వెళ్లిన శ్రీలంక ‘ఏ’ టీమ్ బౌలింగ్ కోచ్ నువాన్ జోయ్‌సా బుకీలతో చేతులు కలిపినట్లు తెలిసింది. 2017లో ఇండియాకు చెందిన ప్రధాన నిందితుడు కొలంబోలో నువాన్ జోయ్‌సాను కలిశాడు. ఆ తర్వాత రెండు మూడు సార్లు వారిద్దరూ కలసుకొని మాట్లాడుకున్నారు. ఆ సమయంలో సదరు వ్యక్తి బుకీ అనీ, మ్యాచ్ ఫిక్సింగ్‌కు ప్రయత్నిస్తున్నట్లు నువాన్‌కు తెలిసినా ఆ విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డుకు కానీ, ఐసీసీకి కానీ తెలియజేయలేదు. పైగా అతడితో కలసి మ్యాచ్ ఫిక్సింగ్‌లో పాలుపంచుకున్నాడు. జాతీయ జట్టుకు కోచ్‌గా ఉన్న నువాన్ జోయ్‌సా ఒక క్రికెటర్‌ను ఇందులో పాలుపంచుకోవాలని ప్రలోభపెట్టాడు. కానీ సదరు క్రికెటర్ నిరాకరించాడు. 2017లో యూఏఈలో జరిగిన టోర్నీలో బుకీలతో సంబంధాలు కలిగి ఉండటంతో ఐసీసీ ఆదేశాల మేరకు ఈసీబీ నువాన్‌పై కేసు నమోదు చేసింది. ఆ మరుసటి ఏడాదే అతడిని సస్పెండ్ చేశారు. మూడేళ్ల విచారణలో అతడిపై ఆరోపణలు అన్నీ నిర్దారణ కావడంతో ఆరేళ్ల నిషేధం విధించారు. గత నెలలో శ్రీలంకకు చెందిన మాజీ పేసర్ దిల్హార లోకుహెత్తిగే కూడా క్రికెట్ నుంచి నిషేధించబడ్డాడు. 2019లో సనత్ జయసూర్య యాంటీ కరప్షన్ యూనిట్‌కు సహకరించడానికి నిరాకరించడంతో అతడిపై కూడా వేటు పడింది. 2016లో శ్రీలంక హాఫ్ స్పిన్నర్ జయవర్దన్ వర్ణవీర కూడా సస్పెన్షన్‌కు గురయ్యాడు. భారత బుకీలతో ఎక్కువగా శ్రీలంక క్రికెటర్లే సంబంధాలు నెరపుతున్నట్లు ఐసీసీ చెబుతున్నది.