హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు.. నా బిడ్డకు తండ్రెవరైతే మీకేంటి?

by  |
హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు.. నా బిడ్డకు తండ్రెవరైతే మీకేంటి?
X

దిశ, సినిమా : యాక్ట్రెస్ అండ్ పొలిటీషియన్ నుస్రత్ జహాన్ ఈ మధ్యే బేబీ బాయ్‌కు జన్మనిచ్చింది. తల్లయ్యాక ఫస్ట్ టైమ్ ఓ సెలూన్ షాప్ ఓపెనింగ్ సెర్మనీలో పాల్గొన్న భామ.. బిడ్డకు తండ్రి ఎవరన్న మీడియా ప్రశ్నకు తెలివిగా సమాధానమిచ్చింది. ఇది అస్పష్టమైన ప్రశ్నగా అభివర్ణించిన నుస్రత్.. తన కొడుకుకు తండ్రి ఎవరో అతనికి తెలిస్తే సరిపోతుందని రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం తామిద్దరం పేరెంట్‌హుడ్‌ను ఎంజాయ్ చేస్తున్నామన్న ఆమె.. రూమర్డ్ బాయ్ ఫ్రెండ్, యాక్టర్ యశ్ దాస్‌గుప్తాతో గుడ్ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నట్లు తెలిపింది. కాగా నుస్రత్ 2019లో బిజినెస్‌మన్ నిఖిల్ జెయిన్‌ను పెళ్లి చేసుకుంది. కానీ ఇండియన్ లా ప్రకారం తమది వివాహం కిందకు రాదని, తాము లివిన్ రిలేషన్‌షిప్‌లో మాత్రమే ఉన్నట్లని జూన్‌లో ప్రకటించింది. ఇంతకీ ఈ ఇద్దరిలో తండ్రెవరు అనే దానిపై నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తుండగా.. తెలియకపోతే మీకేంటి అన్నట్లుగానే సమాధానమిచ్చింది నుస్రత్.

Advertisement

Next Story

Most Viewed