నాన్నే హీరో : నుపుర్ సనన్

by Shyam |
నాన్నే హీరో : నుపుర్ సనన్
X

సనన్ సిస్టర్స్ లాక్‌డౌన్‌ టైమ్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. ఆ టైమ్‌లో కృతి సనన్ తల్లికి డ్యాన్స్ పాఠాలు నేర్పుతుంటే.. నుపుర్ సనన్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్తా వైరల్ అయింది. తల్లితో కృతి స్టెప్పులకు నెటిజన్లు ఫిదా కాగా, తాజాగా నుపుర్.. తండ్రితో కలిసి చేసిన డ్యాన్స్ వీడియో చాలా క్యూట్ గా ఉంది.

అలనాటి క్లాసికల్ సాంగ్ ‘ప్యార్ హువా’ పాట మీద తండ్రితో డ్యాన్స్ చేసిన నుపుర్.. ఈ వీడియో తనకు చాలా సంతోషాన్నిచ్చిందని చెప్పింది. ఒక వైపు డ్యాన్స్‌ను ప్రేమించే తనకెంతో ఇష్టమైన నాన్న.. మరోవైపు తనలోని చిన్నారి చిన్ననాటి హీరోతో కలిసి డ్యాన్స్ చేయడం.. ఈ మూమెంట్ చాలా అద్భుతంగా ఉందని చెప్పింది. చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయని, ఇది డాడీకి ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్‌గా భావిస్తున్నట్లు తెలిపింది నుపుర్.

https://www.instagram.com/p/CCkkl88nJFk/?igshid=dlsf6gvsob1b

Advertisement

Next Story

Most Viewed