- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మూడు గెటప్స్‌లో తారక్
దిశ, వెబ్‌డెస్క్: దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’. ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న ఈ చిత్రంలో తారక్ మూడు గెటప్స్‌లో కనిపిస్తారని సమాచారం. ‘బాహుబలి’ని మించిన విజువల్ ఎఫెక్ట్స్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోనుందని ఫిల్మ్ నగర్ టాక్. తారక్ రైలు నుంచి గన్నులు, బాంబులు దొంగిలించే సీక్వెన్స్ సినిమాకు హైలెట్ కానుందని తెలుస్తోంది. ఈ సీక్వెన్స్ విషయంలో జక్కన్న స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడని టాక్. 1920లో భారతీయ విప్లవకారుల కల్పిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రంలో ఎన్టీఆర్ కొమురంభీంగా కనిపిస్తుండగా.. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. జనవరి 8, 2021లో రిలీజ్ కానున్న సినిమాలో అలియా భట్, అజయ్ దేవగన్, సముతిరఖని, ఒలివియా మారిస్ లాంటి తారలు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్ పతాకంపై దానయ్య చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
tags : RRR, SS Rajamouli, NTR, Ram Charan, DVV Entertainments.