మీ అభిమానానికి రుణపడి ఉంటా : తారక్

by Shyam |   ( Updated:2020-05-20 08:53:54.0  )
మీ అభిమానానికి రుణపడి ఉంటా : తారక్
X

పుట్టినరోజున శుభాకాంక్షలు అందించిన ఫిల్మ్ ఇండస్ట్రీ మిత్రులకు, అభిమానులకు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) కృతజ్ఞతలు తెలిపారు. ఆశీర్వచనాలతో ఈ రోజును చాలా ప్రత్యేకంగా మలిచిన తోటినటులు, శ్రేయోభిలాషులు, ఫిల్మ్ ఫ్రెటర్నిటీ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపిన తారక్.. అన్ని ట్వీట్స్ చదవడం చాలా బాగుందని ఆనందం వ్యక్తం చేశారు.

అభిమాన సోదరులారా..

‘మీరు నా మీద చూపిస్తున్న అభిమానం వెలకట్టలేనిది. అన్నింటా నాకు తోడుగా వస్తున్న మీరే నా బలం.. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? ఏం చేసి ఈ ప్రేమకు అర్హుడిని అవగలను ? చివరి దాకా మీకు తోడుగా ఉండటం తప్ప..’ నా ప్రియమైన అభిమానులారా.. జీవితాంతం మీకు రుణపడి ఉంటాను అని ఎన్టీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Next Story