'ఉప్పెన' దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఎన్టీఆర్..?

by Shyam |
ఉప్పెన దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఎన్టీఆర్..?
X

దిశ, వెబ్ డెస్క్ : రాజమౌళి “ఆర్ ఆర్ ఆర్ ” చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్న ఎన్టీఆర్, ఆ తరువాత కొరటాల శివ డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నారు. “ఉప్పెన” సినిమాతో హిట్ అందుకున్న దర్శకుడు బుచ్చిబాబు ఓ కథ చెప్పడంతో నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట ఎన్టీఆర్. అయితే ఈ సినిమాకి దర్శకుడు సుకుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. “నాన్నకు ప్రేమతో” సినిమాతో సుకుమార్-ఎన్టీఆర్ ల మధ్య సాన్నిహిత్యం బాగా ఉండడంతో, సుకుమార్ దగ్గరుండి చూసుకుంటాడనే నమ్మకంతో ఈ సినిమాకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తుండగా, ఈ ప్రాజెక్ట్ లో ఒక భాగస్వామిగా సుకుమార్ ఉన్నట్లు సమాచారం. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఓ క్రీడాకారుడిగా కనిపిస్తారని సినీ వర్గాల్లో టాక్.

Advertisement

Next Story