అపన్నహస్తం కోసం ఎదురుచూపు.. ఆదుకున్న ఎన్ఆర్ఐలు

by Shyam |
అపన్నహస్తం కోసం ఎదురుచూపు.. ఆదుకున్న ఎన్ఆర్ఐలు
X

దిశ, నల్లగొండ: ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం అభినందనీయమని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. దేవరకొండ పట్టణానికి చెందిన యువకుడు గోలి శ్రీకాంత్ పేగులకు సంబంధించిన ‘‘వ్యాధితో హాస్పిటల్‌లో అపన్నహస్తం కోసం ఎదురు చూస్తుండటంతో తమ వంతు సాయంగా బుధవారం దేవరకొండ యూఎస్ఏ ఎన్నారైలు గోలి శ్రీకాంత్ కుటుంబ సభ్యులకు రూ.3లక్షల చెక్కును క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ…ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటున్న ఎన్ఆర్ఐ వారి సేవలను కొనియాడారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి ప్రతిఒక్కరూ ముందుకు రావాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed