- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
NRIs: ఆస్ట్రేలియాలో ఘనంగా సంక్రాంతి సంబరాలు.. టీపీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ఎల్లలు దాటి (Australia) ఆస్ట్రేలియాకు వచ్చినా కూడా మన తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ అందరూ కలిసి సంబరాలు నిర్వహించుకోవడం చాలా అభినందనీయమని (TPCC Chief Mahesh Kumar Goud) టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియాలో మెల్బోర్న్ తెలుగు అసోసియేషన్ (Sankranti celebrations) సంబరాల్లో తాజాగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సాట్ చైర్మన్ శివసేనారెడ్డి, సలహా దారు జితేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. తెలుగు ప్రజలు ఇక్కడ లక్ష మంది ఉండి ఎంతో కష్టపడి అభివృద్ధికి సహకారాన్ని అందిస్తూ సంప్రదాయాలను కాపాడుతూ ఇలా సంబరాలు చేసుకోవడం గొప్ప విషయమన్నారు.
మన తెలుగు పల్లెల్లో చేసుకున్న విధంగానే ఇక్కడ కూడా పండుగ చేసుకుంటూ ఆనందంగా పండుగ జరుపుతున్నారని తెలిపారు. తెలంగాణలో మన ప్రభుత్వం ఉంది.. ఇక్కడ ఉన్న తెలుగు పారిశ్రామిక వేత్తలు మీ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టి అక్కడ అభివృద్ధికి సహకారాన్ని అందించాలని ఎన్ఆర్ఐలకు పిలుపునిచ్చారు. ఈ సంక్రాంతి ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు, ఆనందం నింపాలన్నారు. సంస్కృతి సంప్రదాయాలు పరిమళించే అతి పెద్ద పండుగ సంక్రాంతి అని, సంక్రాంతి ప్రకృతితో అనుసంధామైన రైతుల పండుగ అని తెలిపారు. ఆరుగాలం శ్రమించి చేతికొచ్చిన పంటను చూసి రైతు మురిసిపోయే పండుగన్నారు.