ఎంపీటీసీ-జెడ్పీటీసీ ఎన్నికలపై త్వరలో నోటిఫికేషన్

by srinivas |
ap SEC Logo
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో పరిషత్ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయా అన్నదానిపై ఇప్పటికీ ఉత్కంఠ నెలకొంది. ఈ ఉత్కంఠకు త్వరలోనే ముగింపు పలికే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 5న నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. తదుపరి ఎస్ఈసీ నేతృత్వంలో ఈ ఎన్నికలు జరగనున్నట్లు సమాచారం. ఇకపోతే గత ఏడాది నోటిఫికేషన్ విడుదలైంది. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో ఆ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇటీవలే ఏపీలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు సైతం ముగిశాయి.

కానీ పరిషత్ ఎన్నికలపై మాత్రం సందిగ్ధత నెలకొంది. ప్రస్తుత ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఈనెల 31న పదవీ విరమణ చేయనున్నారు. పరిషత్ ఎన్నికలు నిర్వహించేందుకు సమయం సరిపోదని.. తాను నిర్వహించలేనని క్లారిటీ ఇచ్చేశారు. దీంతో వైసీపీ ప్రభుత్వం గుర్రుగా ఉంది. కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేయాలంటే ఎన్నికలు నిర్వహించాల్సిందేనని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త ఎస్ఈసీతో నోటిఫికేషన్ విడుదల చేయించాలనే ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నూతన ఎస్ఈసీ ఎంపికకు సంబంధించి ముగ్గురు పేర్లతో కూడిన జాబితాను గవర్నర్‌కు పంపిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story