- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
వైసీపీలో ఎప్పటికీ అదే ఉంటుంది: సజ్జల కీలక వ్యాఖ్యలు

దిశ, వెబ్ డెస్క్: ఐదు కోట్ల మందిని నేరుగా టచ్ చేసింది ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysr Congress Party) మాత్రమేనని వైయస్సార్‌సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) అన్నారు. ప్రతి గడపకూ వెళ్ళి సామాజికంగా, రాజకీయంగా, ఆర్ధికంగా అన్ని వర్గాలను ముందుకు నడిపించిందని వైయస్ జగన్ ప్రభుత్వం అని ఆయన వ్యాఖ్యానించారు. సమాజం అంటే అందరికీ సమాన అవకాశాలు కల్పించాలనే విధంగా వైయస్ జగన్ పాలన కొనసాగించారన్నారు. కలలు కనడం కాదు దానిని ఆచరణలోకి తీసుకురావాలని ఒక్క జగన్ గారు మాత్రమే అసమానతలు ఉన్న సమాజాన్ని ఐదేళ్ళలో దానిని సమాన స్ధాయికి తీసుకొచ్చారని గుర్తు చేశారు. పేదలు, ఎస్సీలు, మైనార్టీలు వీరిని ఎలా పేదరికం నుంచి బయటికి తీసుకురావాలని ఆలోచించి అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని అమలుచేసి నిరూపించిన ఘనత జగన్‌ది అని చెప్పారు. ఒక సంస్కర్తలా అణగారిని వర్గాలను చేయి అందించి పైకి తీసుకొచ్చారని, మొక్కవోని దీక్ష, నిబద్దత వల్లే ఇది సాధ్యమవుతుందన్నారు. అవన్నీ జగన్‌లో చూశాని, వైసీపీ పేదల పక్షం అని గుండెమీద చెయి వేసుకుని చెప్పగలిగిన ధైర్యాన్నిచ్చారని సజ్జల తెలిపారు.
‘‘అదే కూటమి నాయకులు ఏడాది తిరగక ముందే బయటికి రాలేని పరిస్ధితుల్లో ఉన్నారు. రెడ్ బుక్ పేరుతో అక్రమ కేసులు, వేధింపులకు గురిచేస్తూ పాలన సాగిస్తున్నారు. బరితెగింపు పాలన స్పష్టంగా కనిపిస్తుంది. ఏది ఏమైనా వైఎస్సార్‌సీపీ నమ్ముకున్న సిద్దాంతానికి కట్టుబడి ఉంది. వైఎస్సార్‌సీపీ డీఎన్‌ఏ పేదల పక్షపాతిగా ఇలాగే ఉంటుంది. జగన్ అన్నట్లు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ, నా బడుగు బలహీన వర్గాలనేది ఈ పార్టీలో ఎప్పటికీ అదే ఉంటుంది. ఉన్నత విద్య, వైద్యం పేదవాడికి అందినప్పుడే నిజమైన అభివృద్ది అని భావించి జగన్ పాలించారు. సమగ్రమైన ప్రణాళిక, ఆలోచనతో పాలన సాగింది.’’ అని సజ్జల పేర్కొన్నారు.
ఐదు కోట్ల మందిని నేరుగా టచ్ చేసింది ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ప్రతి గడపకూ వెళ్ళి సామాజికంగా, రాజకీయంగా, ఆర్ధికంగా అన్ని వర్గాలను ముందుకు నడిపించింది వైయస్ జగన్ ప్రభుత్వం. సమాజం అంటే అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి అనే విధంగా వైయస్ జగన్ పాలన కొనసాగించారు.… pic.twitter.com/QVGyTWxIka
— YSR Congress Party (@YSRCParty) April 21, 2025