ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డకు నోటీసులు

by srinivas |
ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డకు నోటీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌పై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సభాహక్కుల ఉల్లంఘనపై మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స సత్యనారాయణ స్పీకర్ కార్యాలయానికి నోటీసుల మెయిల్ పంపారు. ప్రజాప్రతినిధుల విషయంలో ఎస్ఈసీ ఇష్టానుసారంగా తన పరిధిని మించి వ్యవహరించారని మంత్రులు పేర్కొన్నారు. సోమవారం స్పీకర్ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేస్తామని మంత్రులు ప్రకటించారు. ఏకగ్రీవాలపై ప్రభుత్వ ప్రకటనను తప్పు పట్టిన నిమ్మగడ్డ.. నిబంధనలకు విరుద్ధంగా విడుదల చేసిన టీడీపీ మేనిఫెస్టోపై పెదవి విప్పకపోవడాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రశ్నిస్తోంది. మరోవైపు ఎస్ఈసీ వైఖరిని నిరసిస్తూ.. కోర్టును ఆశ్రయించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం.

Advertisement

Next Story