- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్...500 సీబీజీ ప్లాంట్ల ఏర్పాటుకు ఎల్లుండే శ్రీకారం

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో విద్యుత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా కంప్రెస్ట్ బయో గ్యాస్ ప్లాంట్ల(Compressed Biogas Plants)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈమేరకు రిలయన్స్ కంపెనీ(Reliance Company)తో చర్చలు జరిపింది. దీంతో రాష్ట్రంలో రూ. 65 వేల కోట్ల పెట్టుబడులతో 500 ప్లాంట్ల ఏర్పాటుకు ఆ సంస్థ అంగీకరించింది. ప్రకాశం, కడప, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, అనంతపురం, పార్వతీపురం, తిరుపతి, అల్లూరి జిల్లాలో సీబీసీ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు ఏప్రిల్ 2న ప్రకాశం జిల్లా కనిగిరిలో రూ.139 కోట్లతో తొలి ప్లాంట్‌కు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి లోకేశ్(Minister Lokesh), రిలయన్స్ సంస్థల(Reliance Industries) అధినేత ముఖేష్ అంబానీ(Mukesh Ambani) కుమారుడు అనంత్ అంబానీ(Anant Ambani) పాల్గొననున్నారు.
అయితే సీబీజీ ప్లాంట్ ఏర్పాటు నేపథ్యంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్(Minister Gottipati Ravikumar) సోమవారం కనిగిరి(Kanigiri)లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 500 సీబీజీ ప్లాంట్ల ఏర్పాటుకు రిలయన్స్ సంస్థ ముందుకు వచ్చిందని తెలిపారు. త్వరలోనే మార్కాపురం, గిద్దలూరు, దర్శిలోనూ ఈ ప్లాంట్లను ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. అలాగే రాష్ట్రంలో నిరూపయోగంలో ఉన్న భూములను వినియోగంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ భూమికి ఎకరాకు రూ. 15 వేలు, ప్రైవేటు భూమికి రూ.31 వేలు కౌలు ఇస్తామని తెలిపారు. దీని వల్ల ప్రకాశం జిల్లాలో యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పేర్కొన్నారు.