- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ.. పట్టించుకోని ఆలయ అధికారులు
by Jakkula Mamatha |

X
దిశ, శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ సోమవారం అనూహ్యంగా పెరిగింది. వరుస సెలవులతో శనివారం నుంచి రద్దీ ఉంది. అయితే సోమవారం తెల్లవారుజాము నుంచి రద్దీ మరింత పెరిగింది. అయితే పెరిగిన రద్దీకి అనుగుణంగా దేవస్థానం అధికారులు, సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకోలేదు. భక్తులు గంటల తరబడి క్యూ లో వేచి ఉండాల్సి వచ్చింది.
ప్రత్యేక దర్శనం టికెట్లు తీసుకున్న వారు కూడా సుమారు రెండు గంటల పాటు క్యూలైన్లలో వేచి ఉన్నారు. భక్తుల రద్దీ కారణంగా శని, ఆదివారాల్లో కార్యాలయం సిబ్బంది కూడా ప్రత్యేక విధులు నిర్వహించారు. అయితే సోమవారం రద్దీ పెరిగినా ప్రత్యేక సిబ్బంది కనిపించలేదు. క్యూల నిర్వహణ అస్తవ్యస్తం గా తయారైంది. బాధ్యత కలిగిన అధికారులు, సిబ్బంది లేకపోవడంతో భక్తులు అవస్థలు పడ్డారు.
Next Story