- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఎల్ఎండీలో నీటి నిల్వ పెంచకపోతే యుద్ధమే.. మాజీ మంత్రి..

దిశ, తిమ్మాపూర్ : దిగువ ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తున్న తరుణంలో ఎల్ఎండీ రిజర్వాయర్లో నీటిమట్టం గణనీయంగా పడిపోయి తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉందని, ఎగువ ప్రాంతాల నుంచి ఎల్ఎండికి నీటిని తరలించి వారం రోజుల్లో ఎల్ఎండిలో నీటి నిల్వను పెంచకపోతే తమ పార్టీ తరఫున తీవ్రంగా ఉద్యమిస్తామని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హెచ్చరించారు. సోమవారం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం
లోయర్ మానేరు డ్యాంలోని నీటిని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో కట్టిన డ్యామ్ నుంచి వచ్చే నీటిని ఈ ప్రభుత్వం అంటరానిదిగా చూస్తుందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మేడిగడ్డ వద్ద కాపర్ డ్యాం కట్టయినా మిడ్ మానేరు కు నీటిని తరలించాలని డిమాండ్ చేశారు. ఎల్ఎండిలో 15 టిఎంసీలకు తగ్గకుండా నీటిని నిల్వ ఉంచే విధంగా ప్రభుత్వం, అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వం లో 12 లక్షల మందికి తాగునీరు మిషన్ భగీరథ ద్వారా అందించామని,
సూర్యాపేట వరకు తాగునీరు, సాగునీరు ఎల్ ఎం డి రిజర్వాయర్ నీటిని అందించామని పేర్కొన్నారు.
సమాఖ్య పాలనలో నీటి యుద్దాలు జరిగాయని, అనంతరం తెలంగాణ సాధించుకున్నాక కేసీఆర్ పాలనలో నీటి కోసం కొట్లాడిన రోజు లేదని అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో మళ్ళీ తాగునీటి యుద్దాలు జరిగేలా కన్పిస్తున్నాయని పేర్కొన్నారు.
గతంలో ఏనాడు లేని విధంగా ఎల్ఎండి లో 5 టీఎంసీల నీరు మాత్రమే నీరు నిల్వ ఉందని, వచ్చే మూడు నెలల్లో తాగునీటిని ఎలా అందిస్తారని ప్రశ్నించారు.
కరీంనగర్ కార్పొరేషన్ కు తాగునీరు అందించడానికి ఏమి ప్రణాళిక చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో బిఆర్ఎస్ పార్టీ మాజీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.