- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బల్దియా కార్మికులకు అమలుకాని రూ.3 వేల పెంపు
‘మూడు వేల రూపాయల జీతం పెరిగిందని సంతోష పడ్డాం. కానీ నెల గడిచినా పెరిగిన జీతం మాత్రం ఖాతాల్లో కనిపించడం లేదని‘ బల్దియా కార్మికులు ఆవేదన చెందుతున్నారు. ఆదేశాలిచ్చిన జీహెచ్ఎంసీ అధికారులు ఈ విషయంతో తమకేం సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తుండడంతో బల్దియా పరిధిలోని 18 వేల మంది కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్ఎంసీ పరిధిలోని శానిటేషన్, ఎంటమాలజీ విభాగాల్లోని ఎస్‌ఎఫ్ఏ, సిబ్బంది కలిపి సుమారు 18 వేల మందికి రూ.3వేల చొప్పున పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందే దీనిని ప్రకటించింది. ఉద్యోగాలు పర్మినెంట్ చేయకపోయినా కనీసం జీతాలైనా పెంచారని బల్దియా కార్మికులు అధికార పక్షానికి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మద్దతు తెలిపారు. ఎన్నికల ముగిసిన తర్వాత డిసెంబర్ 6వ తేదీన అధికారికంగా జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ వేతనాల పెంపుపై ఆదేశాలు ఇచ్చారు. నవంబర్ ఒకటో తేదీ నుంచే ఇది అమలవుతోందని అందులో స్పష్టంగా పేర్కొన్నారు.
అయితే సాధారణంగా నెల దాటగానే మొదటి రెండు రోజుల్లో రావాల్సిన జీతాలు ఇప్పుడు ఇస్తున్నారు. పెరిగిన జీతాలు వస్తాయని భావించిన కార్మికులు బ్యాంకు వద్దకు వెళ్లి అవాక్కవుతున్నారు. పెంచిన జీతం రాలేదని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. జీతాల కోసం చార్మినార్, ఎల్‌బీ నగర్, ఖైరతాబాద్ జోన్ల నుంచి వందల కొద్దీ కార్మికులు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని ఎస్‌బీఐ బ్రాంచ్‌కు చేరుకున్నారు. అక్కడకొచ్చిన కార్మికులతో బ్యాంకు సిబ్బంది రూ.వంద తీసుకొని కేవైసీ పత్రాలు చేతులో పెడుతున్నట్లు తెలిసింది. బల్దియా శానిటేషన్, ఎంటమాలజీ విభాగంలో పెంచిన జీతాలను పరిగణలోకి తీసుకుంటే సుమారు రూ.5.40 కోట్లు అదనంగా కేటాయించాల్సి వస్తుంది. ఈ నెల 1, 2 తేదీల్లో చెల్లించాల్సిన జీతాలను నిధుల సమస్య కారణంగా నవంబర్ జీతాలనే ఇప్పుడు చెల్లిస్తున్నారు.
పెంచిన జీతాలు ఇవ్వాలి
కార్మికులకు రూ.3 వేల చొప్పున జీతాలు పెంచుతున్నట్టు ప్రభుత్వం రెండు నెలల కిందటే ప్రకటించింది. దీంతో శానిటేషన్ విభాగంలోని 18 వేల మంది కార్మికుల కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుంది. కానీ అధికార పార్టీ తన రాజకీయ ప్రయోజనాల కోసం జీతాలు పెంచి ఇప్పుడు ఇవ్వకపోవడం దుర్మార్గం. ఇప్పటికైనా వెంటనే అమలు చేయాలి. లేకపోతే కార్మికుల పక్షాన పోరాటాలు చేస్తాం.
– శంకర్, బీఎంఎస్, నాయకుడు, జీహెచ్ఎంసీ