కరోనాపై ఆందోళన వద్దు:కలెక్టర్ హనుమంతరావు

by sudharani |
కరోనాపై ఆందోళన వద్దు:కలెక్టర్ హనుమంతరావు
X

దిశ,మెదక్: కరోనా వ్యాధిపై ప్రజలెవరూ ఆందోళన వద్దని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం హనుమంతరావు అన్నారు. కలెక్టరేట్ నుంచి తహసీల్దార్ లు, మండల అభివృద్ధి అధికారులు, ప్రభుత్వ వైద్య అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. రెవెన్యూ డివిజనల్ అధికారులు జీవో నెంబర్ 4ను తప్పనిసరిగా అనుసరించాలని అన్నారు.

తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు : ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి

కరోనా వైరస్ గురించి ప్రజలను భయబ్రాంతులకు గురిచేసేలా సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసే వారిపై చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని సంగారెడ్డి జిల్లా ఎస్పీ హెచ్చరించారు. తప్పుడు ప్రచారం చేస్తూ, ప్రజలలో ఆందోళన రేకెత్తించిన ముగ్గురు వ్యక్తులపై ఇప్పటికే జిల్లాలో కేసు నమోదు చేసినట్టు గుర్తుచేశారు. డాక్టర్లు చెప్పిన జాగ్రత్తలు పాటిస్తే కరోనా రాదని సూచించారు.

tags;no tension about coronavirus,sangareddy collector hanumantharao, if rang campaign take action, sp chandrasekhar reddy

Advertisement

Next Story

Most Viewed