- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగనివ్వం
దిశ, వరంగల్: కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా చేపట్టే కార్యాక్రమాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్, ఎస్పీ నంద్యాల కోటి రెడ్డి , జిల్లా వైద్యశాఖ అధికారి శ్రీరామ్‌లతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..దురదృష్టవశాత్తు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసు నమోదైందని వివరించారు. అనుమానితుల రక్త నమూనాలను పరీక్షలకు పంపించినట్టు ఆమె వివరించారు. మొత్తం 24 మందిలో 8మంది రిపోర్ట్స్ వచ్చాయని, ఇంకా 16 రిపోర్టులు రావాల్సి ఉందన్నారు. కరోనా వైరస్ నియంత్రణపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో కరోనా పాజిటివ్ వ్యక్తిని హైదరాబాదులోని గాంధీ హాస్పటల్‌కు తరలించి ఐసోలేషన్‌లో చికిత్స అందజేస్తున్నామన్నారు. ఇకమీదట జిల్లాలో ఎవరికీ వైరస్ పాజిటివ్ సోకకుండా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
Tags: lockdown, corona, no problems to people, minister satyavathi