- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బస్తీ దవాఖానల్లో నో ఫార్మసిస్ట్
దిశ, మలక్ పేట్: హైదరాబాద్ నగరంలోని బస్తీ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం బస్తీదవాఖానలను ఏర్పాటు చేసింది. ఆర్భాటంగా ప్రారంభించిన బస్తీ దవాఖానల్లో ఫార్మసిస్టులను నియమించడం విస్మరించింది. దీంతో మందులు ఇచ్చేందుకు ఎవరూ లేకపోవడంతో రోగులు ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీలోని మహేల్లా క్లినిక్ తరహాలో తెలంగాణ ప్రభుత్వం బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసింది. బస్తీ దవాఖానలో నిబంధనలకు విరుద్ధంగా ఫార్మసిస్టులు లేకుండానే రోగులకు మందులు పంపిణీ చేస్తున్నారు. ప్రపంచం ఫార్మారంగంలో దేశం రెండో స్థానంలో ఉండగా బస్తీ దవాఖానల్లో అసలు ఫార్మసిస్టులు ఏకపోవడం గమనార్హం.
నిబంధనలు ఏం చెబుతున్నాయి..
డ్రగ్స్ అండ్ కాస్మొటిక్ యాక్ట్ 1948 సెక్షన్ 42 ప్రకారం మందుల సరఫరాలో ఫార్మసిస్ట్ తప్పని సరి. కానీ, అందుకు విరుద్ధంగా బస్తీ దవాఖానల్లో ఫార్మసిస్ట్లు లేకుండానే మందులు పంపిణీ చేస్తున్నారు. ప్రతీ దవాఖానలో సుమారు 150 రకాల మందులు అందుబాటులో ఉంటాయి. ఫార్మసిస్ట్ లు లేకపోవడంతో డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బందిపై అదనపు భారం పడుతోంది. జీహెచ్ఎంసీ, వైద్య ఆరోగ్య శాఖ సంయుక్తంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానలకు అవసరమైన భవనాలతో పాటు మౌలిక సదుపాయాలను జీహెచ్ఎంసీ సమకూరుస్తుండగా, డాక్టర్లు, ఇతర సిబ్బందిని వైద్యఆరోగ్యశాఖ నియమిస్తుంది. 5వేల నుం చి 10వేల జనాభాకు ఒక బస్తీదవాఖాన ఏర్పాటు చేశారు. ప్రైవేట్ హాస్పిటల్ ఫీజులు భరించలేని పేదలు బస్తీ దవాఖానలకు వస్తుండగా వారికి మందులు పం పిణీ చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సాధారణ జ్వరంతో పాటు అవసరమైన వ్యాధి నిర్ధారణ కోసం దాదాపు 51 పరీక్షలను నిర్వహించేందుకు నమూనాలు సేకరించి వైద్యం అంది స్తాయి.
ఫార్మసిస్టులే కీలకం..
దవాఖానల్లో ఔషధాల సరఫరా ఫార్మసిస్ట్ లు మాత్రమే చేయాలని చట్టం చెబుతోంది. వైద్యులు రాసిన చీటిచూసి మందులు ఇవ్వాల్సిన బాధ్యత ఫార్మసిస్ట్ లదే. కానీ, నగరంలోని బస్తీ దవాఖానల్లో ఫార్మసిస్ట్ ల నియామకం జరుగనే లేదు. ఈ విషయంలో డ్రగ్ అండ్ కంట్రోల్ అధికారులు పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
నిరుద్యోగులుగా ఫార్మసిస్టులు..
తెలంగాణ రాప్ట్రంలో 100 బీఫార్మసీ, 40 డీఫార్మసీ కాలేజీలు ఉన్నాయి. వీటిలో ప్రతీ ఏటా సుమారు 9వేల మంది ఫార్మసీ పూర్తి చేసి తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 65 వేలకు పైగా ఫార్మసిస్టులు ఉన్నారు. మందుల తయారీ, అమ్మకం, పరిశోధనల్లో ఫార్మసిస్టులది కీలక పాత్ర. ఇటీవల కాలంలో నియామకాలు జరుగకపోవడంతో ఎంతో మంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. జీహెచ్ఎంసీ, వైద్య ఆరోగ్య శాఖ నగరం లో సంయుక్తంగా 193 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసినప్పటికీ ఫార్మసిస్ట్ ల నియామకం గురించి ఆలోచించకపోవడం సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
ఫార్మసిస్ట్ చట్టం అమలు చేయాలి..
బస్తీ దవాఖానల్లో డ్రగ్స్ అండ్ కాస్మొటిక్ యాక్ట్ 1948 సెక్షన్ 42 ప్రకారం మందుల సరఫరాలో ఫార్మ సిస్ట్లు తప్పనిసరిగా ఉండాలి. బస్తీ దవాఖానల్లో ఫార్మసిస్ట్లను నియమిస్తే కనీసం 600 మందికి ఉపాధి లభిస్తుంది.
-శ్రీనివాస్ కుమార్, తెలంగాణ ఫార్మసిస్ట్అసోసియేషన్ అధ్యక్షుడు
దిక్కుతోచని స్థితిలో ఫార్మసిస్ట్లు..
ఢిల్లీ, మహారాష్ట్ర బస్తీ దవాఖానల్లో ఫార్మసిస్ట్లను నియమించి నెలకు రూ.50 వేల వేతనం ఇస్తున్నారు. తెలంగాణలో ప్రతీయేడు 9వేల మంది డీ ఫార్మసీ, బీ ఫార్మసీ పూర్తి చేస్తున్నారు. ఉపాధి లేక దిక్కు తోచని స్థితిలో ఉన్నారు.
-రామదాస్, తెలంగాణ ప్రైవేట్ ఫార్మసీ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు
ఫార్మసిస్ట్లను నియమించాలి..
మెడికల్ ప్రాక్టీషనర్ ల ప్రిస్క్రిప్షన్ లో లోటుపాట్లను గుర్తించి సవరించగల సమర్థులు ఫార్మసిస్ట్ లు మాత్రమే. బస్తీ దవాఖానల్లో ఫార్మసిస్ట్ లను నియమించాలి.
-డాక్టర్ రాపోలు సత్యనారాయణ, ఇండియన్ ఫార్మాస్యూటికల్ అసోసియేషన్ జీవిత కాల సభ్యుడు