కోవిడ్-19 ఎఫెక్ట్..మీడియాకు నో ఎంట్రీ   

by sudharani |
కోవిడ్-19 ఎఫెక్ట్..మీడియాకు నో ఎంట్రీ   
X

దిశ, హైదరాబాద్
తెలంగాణలో కోవిడ్-19కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి.బుధవారం ఉదయం గాంధీలో మరోకరికి కరోనా పాజిటివ్ అని తేలగా, రోగుల సంఖ్య ఇద్దరికి చేరింది. దీంతో నగరవాసులు భయాందోళనలకు గురవుతున్నారు. తెలంగాణలో కరోనా అనుమానితుల సంఖ్య 457కు చేరగా, ఒక్కరోజు వ్యవధిలోనే శంషాబాద్ ఎయిర్ పోర్టులో 42 అనుమానిత కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 18,224 మంది అనుమానితులకు థర్మల్ స్క్రీనింగ్స్ నిర్వహించారు. మంగళవారం గాంధీ ఆస్పత్రిలో నిర్వహించిన పరీక్షల్లో 45మందికి కరోనా లేదని తేలగా, మరో ఇద్దరి రిపోర్టులను పుణెలోని వైరాలజీ ల్యాబ్ కు పంపించినట్టు గాంధీ వైద్యులు శ్రీనివాస్ తెలిపారు. వారి ఫలితాలు రేపు వస్తాయని సమాచారం. కోవిడ్-19 దెబ్బకు గాంధీ ఆస్పత్రి వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు. ఇక మీదట మీడియాకు గాంధీ ఆవరణలో అనుమతి లేదని తేల్చిచెప్పారు. మీడియా వాహనాలు కూడా వెంటనే ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

tags ; covid-19, hyd, 2 positive cases, gandhi hospital, no entry for media

Advertisement

Next Story

Most Viewed