- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మల్కాజిగిరిలో సిట్టింగ్ కార్పొరేటర్లకు మొండిచేయి ?
దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మల్కాజిగిరిలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మొత్తం ఆరు డివిజన్లలోని కార్పొరేటర్లు మళ్లీ ఎన్నికలకు రెడీ అవుతుండగా.. ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఇద్దరి టికెట్లు మార్చడానికి ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇదే క్రమంలో కార్పొరేటర్లు ఎవరుంటారు ? ఎవరు వెళ్తారన్న దానిపై తీవ్రంగా చర్చలు నడుస్తున్నాయి. దీంతో రెండు డివిజన్లలోని ఆశావహులు టికెట్ల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేయగా.. సిట్టింగ్‌లు ఏకంగా హైకమాండ్ దగ్గర నుంచి టికెట్లు తెచ్చుకోవాలని లాబియంగ్ చేస్తున్నట్లు సమాచారం.
మల్కాజిగిరి సర్కిల్‌లో గౌతంనగర్, ఈస్ట్ ఆనంద్‌బాగ్, మౌలాలీ, నేరేడ్‌మెట్, మల్కాజిగిరి, వినియకనగర్ డివిజన్లు ఉన్నాయి. ఆరుగురూ టీఆర్ఎస్ కార్పొరేటర్లే. అందులో ఈస్ట్‌ఆనంద్ బాగ్, గౌతంనగర్ డివిజన్ల అభ్యర్థులను మార్చేందుకే ఎమ్మెల్యే మైనంపల్లి ఫిక్సైనట్లు ప్రచారం నడుస్తోంది. ఈస్ట్‌ఆనంద్‌బాగ్ కార్పొరేటర్ మొదటి నుంచి తనకు సహకరించకుండా కలిసి కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఉంటున్నాడని, అందుకే అక్కడ ఓ అభ్యర్థికి టికెట్ కన్ఫామ్ చేసినట్లు సమాచారం. ఇక గౌతంనగర్ డివిజన్ కార్పొరేటర్ మహిళ కాగా, ఆమె భర్త పై ఎమ్మెల్యే అసంతృప్తితో ఉండటంతో చెక్ పెడతారని తెలుస్తోంది. అయితే, గౌతంనగర్ కార్పొరేటర్ భర్త మాత్రం హైకమాండ్ నుంచి లేదా ఎమ్మెల్యేను చివరి నిమిషంలో ఒప్పించి తిరిగి పోటీ చేస్తారనే చర్చ విస్తృతంగా సాగుతోంది.
అటు.. మౌలాలీ కార్పొరేటర్‌పైన అవినీతి ఆరోపణలు, ప్రభుత్వ కార్యక్రమాల్లో జాప్యం, ప్రజలకు అందుబాటులో ఉండడన్న విమర్శలతో అభ్యర్థిని మార్చుతారని ప్రచారం సాగుతుండగా.. అక్కడి నుంచి ఓపత్రికా రిపోర్టర్ విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. నేరేడ్‌మెట్ కార్పొరేటర్ కేవలం తమ వ్యాపార కార్యకలాపాలున్న ప్రాంతాల్లోనే అభివృద్ది చేసి, మిగతా ప్రాంతాలను విస్మరించాడని ఆరోపణలు వస్తుండటంతో ఆయన్ను మార్చుతారా లేకుంటే ఓకే చెప్పి టికెట్ కొనసాగిస్తారా అన్నది ఎలక్షన్స్ టైంలో తేలనుంది.
అయితే.. మల్కాజిగిరి రాజకీయాల్లో ఇంత జరుగుతున్నా కార్పొరేటర్లు మాత్రం తమ పని తాము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈస్ట్‌ఆనంద్‌బాగ్, గౌతమ్‌నగర్‌లో ఎమ్మెల్యే తమకు అవకాశం ఇవ్వట్లేదని, తామే పోటీ చేయబోతున్నామని నాయకులు ప్రచారం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈస్ట్ ఆనంద్‌బాగ్ డివిజన్ నుంచి మాజీ కార్పోరేటర్ పోటీ చేయడం దాదాపు ఖాయమైనట్టు ప్రచారం సాగుతుండగా గౌతంనగర్‌లో స్థానికంగా బలమైన మైనంపల్లి అనుచరుడు బరిలో దిగేందుకు రెడీ అవుతున్నాడు.