- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘కల్వకుంట్ల కుటుంబానికి.. ప్రపంచ వ్యాప్తంగా ఆస్తులు’
దిశ, వరంగల్: రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ హిందూ వ్యతిరేకుల చేతిలో పెట్టారని నిజమాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం వరంగల్ జిల్లాలో పర్యటించిన ఎంపీ అర్వింద్, అనంతరం జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కల్వకుంట్ల కుటుంబానికి ప్రపంచ వ్యాప్తంగా ఆస్తులున్నాయని ఆరోపించారు. తొందర్లోనే వీరి అక్రమాలు బహిర్గంతం చేసి చంచల్‌గూడ జైల్లో ఒక ప్రత్యేక గది ఏర్పాటు చేస్తామన్నారు. ఓవైసీ సీఎం కేసీఆర్ పెద్దకొడుకు అని సంచలన వాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను తెలియజేసేందుకు వరంగల్‌కు వచ్చినట్టు తెలిపారు. అనంతరం వరంగల్ అర్బన్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును కలిసి ఎంజీఎం ఆస్పత్రి పని తీరును అడిగి తెలుసుకున్నారు. కరోనా చికిత్స కోసం కేంద్ర ప్రభుత్వం అందించిన వెంటిలేటర్లను ఉపయోగించుకునే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేకపోవటం బాధకరమన్నారు. ఎంజీఎం ఆస్పత్రికి కావాల్సిన స్టాఫ్‌ను రిక్రూట్ చేసుకొని చికిత్స అందించేలా చూడాలని కోరారు. ఎంజీఎం ఆస్పత్రిలో కరోనా బారిన పడ్డ రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు. ప్రజలు కష్టాల్లో ఉంటే సీఎం ఫామ్ హౌస్‌లో గడిపారని ఎద్దేవా చేసారు. కేసీఆర్, కేటీఆర్ వారి చెంచాలు కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, కరోనా కష్టకాలంలో కేంద్రం రూ.20లక్షల కోట్ల ప్యాకేజీ ఇస్తే సీఎం కుటుంబం రాష్ర్టాన్ని దోచుకుందని ఆరోపించారు. కేసీఆర్‌ను గాంధీతో పోల్చకుండా జిన్నాతో పోల్చాలన్నారు. నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత ఖాళీ భూమి కనిపిస్తే చాలు.. కబ్జా చేసేస్తారని ఎద్దేవా చేసారు. నిజామాబాద్‌లో మహిళా కళాశాలకు చెందిన భూమిని అక్రమించారని ఆయన ధ్వజమెత్తారు. ఆమెను ఆదర్శంగా తీసుకున్న వరంగల్ తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేలు ధాస్యం వినయ్ భాస్కర్, నన్నపనేని నరేందర్ నగరంలో గజం భూమి ఖాళీగా కనిపిస్తే కబ్జా చేసేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి వారికి తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని ఆయన ఆరోపించారు.