కరోనా కట్టడికి సామాజిక దూరమే ఆయుధం: కలెక్టర్ శరత్

by Shyam |
కరోనా కట్టడికి సామాజిక దూరమే ఆయుధం: కలెక్టర్ శరత్
X

దిశ, నిజామాబాద్: కరోనా వైరస్ కట్టడికి సామాజిక దూరం ఒక్కటే ఆయుధమని కలెక్టర్ శరత్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌లోని జనహిత హాలులో మండల స్థాయి అధికారులతో మంగళవారం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. లాక్‌డౌన్‌ అమలు చేయడానికి గ్రామ, మండల స్థాయి అధికారులు కట్టుదిట్టంగా వ్యవహరించాలని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద సామాజిక దూరం పాటించేలా అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా ఉపాధి హామీ కూలీలు పని ప్రదేశాల్లో కచ్చితంగా మాస్కులు ధరించేలా చూడాలని చెప్పారు. ప్రతి మండలంలో మహిళా సంఘాల ద్వారా 30 వేల మాస్కులు తయారీ చేసి గ్రామాల్లో విక్రయించాలన్నారు. కంటైన్‌మెంట్ ఏరియాలో లాక్‌డౌన్ పటిష్టంగా అమలు చేయాలని కోరారు. ఎస్పీ శ్వేతా మాట్లాడుతూ గ్రామాల్లో మాస్కులు వినియోగించని వారికి జరిమానాలు విధించాలని చెప్పారు. మాస్కులు ధరించేలా గ్రామాలు, మండల కేంద్రాల్లో అవగాహన కల్పించాలని కోరారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోతురే, అసిస్టెంట్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్, జిల్లా ఆస్పత్రి సూపర్‌టెండెంట్ అజయ్‌కుమార్, జిల్లా ఆరోగ్య మిషన్ అధికారిని విశాలారాణి, అధికారులు పాల్గొన్నారు.

Tags: Nizamabad,collector sharath,video conference,corona virus,

Advertisement

Next Story