- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్యాంకుల చుట్టూ అన్నదాతల చక్కర్లు.. రైతుబంధు వడ్డీ కింద జమ!
దిశ, వెబ్‌డెస్క్ : రైతులను కొన్ని బ్యాంకులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ప్రభుత్వం అందించే రైతుబంధు డబ్బులను గతంలో తీసుకున్న రుణాలకు వడ్డీ కింద జమ చేసుకుంటున్నాయి. దీంతో ప్రస్తుతం ఖరీఫ్ సాగుకోసం అన్నదాత మళ్లీ అప్పుల బాట పడుతున్నాడు. ఈ ఘటన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం ఆలస్యంగా వెలుగుచూసింది. రైతు బంధు నగదను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసిన వెంటనే వాటిని డ్రా చేసుకోకుండా కొన్ని బ్యాంకులు ఫ్రీజ్ చేస్తున్నాయి. రెన్యువల్ చేసుకున్న వారికే కొత్తగా లోన్లు ఇస్తున్నట్లు సమాచారం. గతేడాది రెండు సీజన్లలో రూ.1,315 రుణాలను బ్యాంకులు మంజూరు చేశాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తంగా 4.5 లక్షల మంది రైతులు ఉండగా, 7లక్షల ఎకరాల్లో వర్షాకాలం పంట సాగుకి ప్రణాళికలు సాగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రైతు బంధు డబ్బులను బ్యాంకులు ఫ్రీజ్ చేస్తుండటంతో ఏం చేయాలో తెలీక అన్నదాతలు తలలు పట్టుకుంటున్నారు. దీనిపై అధికారులు వెంటనే స్పందించి రైతు బంధు సాయం తమకు అందేలా చూడాలని రైతులు వేడుకుంటున్నారు.
ఉమ్మడి నల్గొండలోనూ..
ఉమ్మడి నల్గొండ జిల్లాలోనూ పలు బ్యాంకులు కౌలు రైతులకు కొత్తగా రుణాలు ఇచ్చేందుకు వెనుకంజ వేస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా పది లక్షల మంది రైతులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా ఖరీఫ్ సాగు పెట్టుబడి కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు.అయితే, కార్పొరేట్ కంపెనీలకు రుణాలు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తంచేస్తున్న బ్యాంకులు రైతులకు ఇచ్చేందుకు నిరాసక్తత కనబరుస్తున్నాయి. పాత రుణాలు క్లియర్‌గా ఉంటేనే కొత్తవి ఇస్తామని కండిషన్స్ పెడుతున్నట్లు రైతులు వాపోతున్నారు.