కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన స్టార్ హీరోయిన్

by Shyam |
కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన స్టార్ హీరోయిన్
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరోయిన్ నివేదా థామస్ ఆఫ్రికా ఖండంలోనే అత్యంత ఎత్తైన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించింది. ఈ మేరకు సంతోషకరమైన విషయాన్ని తెలియజేస్తూ ట్వీట్‌ చేసిన నటి.. ‘ఆఫ్రికాఖండంలోని కిలిమంజారోని అధిరోహించాను’’ అంటూ ఆమె ఓ ఫొటో షేర్‌ చేసింది. అలాగే ‘చిన్ననాటి నుంచి ట్రెక్కింగ్‌ అంటే చాలా ఇష్టం. కిలిమంజారో అధిరోహించాలనే లక్ష్యంతో ఆరు నెలలపాటు ట్రెక్కింగ్‌లో ప్రత్యేక శిక్షణ పొందాను. 19,340 అడుగుల ఎత్తు ఉన్న కిలిమంజారో పర్వతంపై ట్రెక్కింగ్‌ ఎంతో సాహసోపేతంతో కూడుకున్నది. ప్రపంచంలోనే ఎత్తైన స్వేచ్ఛా పర్వత శిఖరానికి చేరుకోవడం ఆనందంగా ఉంది’ అని వివరించింది. ఇక ప్రస్తుతం ‘మీట్‌ క్యూట్‌’లో నటిస్తుండగా.. పవన్ కళ్యాణ్ సినిమా ‘వకీల్‌సాబ్‌’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed