- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘నిశ్శబ్దం’ ఓటీటీ డీల్ ఓకే?

స్వీటీ అనుష్క శెట్టి.. తన 15 ఏళ్ల సినీ ప్రయాణంలో అద్భుతంగా రాణించింది. కెరియర్ తొలినాళ్లలో గ్లామర్ టచ్ ఇచ్చిన స్వీటీ.. అరుంధతి సినిమా తర్వాత లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకే ఓటేసింది. బాహుబలిలో దేవసేన పాత్రతో మాహిష్మతి సామ్రాజ్యానికే సవాల్ విసిరిన అనుష్క.. భాగమతి సినిమాతో బాక్సాఫీస్ వద్ద తన స్టామినాను చూపించింది. ప్రస్తుతం ‘నిశ్శబ్దం’తో అలరించేందుకు సిద్ధంగా ఉంది. కాగా, ఈ సినిమాను థియేటర్స్‌లోనే విడుదల చేయాలా? లేక ఓటీటీలో రిలీజ్ చేయాలా? అన్న ప్రశ్న సోషల్ మీడియాలో ప్రేక్షకులను అడుగుతున్నారు నిర్మాతలు. 50 శాతానికి పైగా ఆడియన్స్ ఓటీటీలో అనుష్క సినిమా చూడాలనుకుంటున్నామని చెప్పడంతో.. నిర్మాతలు కూడా అదే నిర్ణయానికి వచ్చారని సమాచారం.
కోన వెంకట్, టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన ‘నిశ్శబ్దం’ చిత్రాన్ని హేమంత్ మధుకర్ తెరకెక్కించారు. ఏప్రిల్ 2న సినిమా విడుదల కావాల్సి ఉన్నా కరోనా కారణంగా వాయిదా పడింది. దీంతో ఆడియన్స్ పోల్ నిర్వహించి మరీ.. సినిమాను అమెజాన్ ప్రైమ్ (Amazon prime)లో విడుదల చేస్తున్నారు. సెప్టెంబర్‌లో అమెజాన్‌లో సినిమా విడుదల కానుందని తెలుస్తోంది. కాగా, సినిమాలో ఆర్.మాధవన్, అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు కీలక పాత్రలు పోషిస్తుండగా.. స్వీటీ మూగ పాత్రలో కనిపించనుంది.