రజతోత్సవ వేడుకలు టీఆర్ఎస్ కు చేస్తున్నారా ? బీఆర్ఎస్ కా? - చామల

by Veldandi saikiran |   ( Updated:2025-04-21 07:34:23.0  )
రజతోత్సవ వేడుకలు టీఆర్ఎస్ కు చేస్తున్నారా ? బీఆర్ఎస్ కా? - చామల
X

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ( Congress MP Chamala Kiran Kumar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. రజతోత్సవ వేడుకలు టీఆర్ఎస్ కు ( TRS) చేస్తున్నారా లేక బీఆర్ఎస్ కు ( BRS) చేస్తున్నారా..? అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ( KTR) కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. 2001లో పుట్టిన టీఆర్ఎస్ తర్వాత బీఆర్ఎస్ గా మారిందని గుర్తు చేశారు.

తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్న తర్వాత దేశాన్ని దోచుకునే ఆలోచనతో టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. 27న జరగబోయే సభ బ్యాక్ డ్రాప్ లో టీఆర్ఎస్ ఉంటుందా బీఆర్ఎస్ ఉంటుందా..? అని నిలదీశారు ఎంపీ చామల ( Chamala Kiran Kumar Reddy).

అటు కేసీఆర్ సభ పై వర్థన్నపేట ఎమ్మెల్యే నాగరాజు హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం వ్యవసాయ కాలువలు, వాగులను ధ్వంసం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. దేవాదుల కాలువను పూర్తిగా పూడ్చేశారని ఆగ్రహించారు. వేలాది ట్రిప్పుల మొరం తరలిస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. పూడ్చిన పెద్ద వాగు, దేవాదుల కెనాళ్లపై అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని తెలిపారు వర్థన్నపేట ఎమ్మెల్యే నాగరాజు.



Next Story