ఆలా జరిగి ఉంటే, 10 ఏళ్ళ కిందటే ఎమ్మెల్యే అయ్యేవాడిని: ఆది శ్రీనివాస్

by Veldandi saikiran |
ఆలా జరిగి ఉంటే, 10 ఏళ్ళ కిందటే ఎమ్మెల్యే అయ్యేవాడిని: ఆది శ్రీనివాస్
X

దిశ, వెబ్ డెస్క్: వేములవాడ కాంగ్రెస్ ఎమ్యెల్యే ఆది శ్రీనివాస్ ( aadi srinivas) హాట్ కామెంట్స్ చేశారు. చెన్నమనేని రమేశ్ ఇండియన్ సిటిజన్ కాదని హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. చెన్నమనేనిపై హై కోర్టు ఇచ్చిన తీర్పు పై స్పందించారు. చెన్నమనేని తప్పుడు పత్రాలు సృష్టించి ఎన్నికల్లో పోటీ చేయకుంటే పదేళ్ల క్రితమే నేను ఎమ్మెల్యే అయ్యేవాడిని అంటూ వ్యాఖ్యానించారు ఆది శ్రీనివాస్.

వేములవాడ నియోజకవర్గ ప్రజలను మోసం చేసిన చెన్నమనేని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. చెన్నమనేని భారత పౌరుడు కాదని నేను మొదటి నుంచీ చెబుతూనే ఉన్నా... 15 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో న్యాయమే గెలిచిందన్నారు. కోర్టులపై ప్రజలకు విశ్వాసం పెరిగిందని తెలిపారు. ఆది శ్రీనివాస్



Next Story

Most Viewed