సిద్దిపేటకు చేరిన టీజేఎస్ యాత్ర…

by Shyam |
సిద్దిపేటకు చేరిన టీజేఎస్ యాత్ర…
X

దిశ,సిద్దిపేట:
‘నిరుద్యోగుల బతుకు దెరువు సాధన’యాత్ర సిద్దిపేటకు బుధవారం చేరుకుంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మొత్తం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతిని వెంటనే అమలు చేయాలన్న డిమాండ్‌తో తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో ఈ యాత్రను చేపట్టారు. అనంతరం సిద్దిపేటలోని అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా తెలంగాణ జన సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర కన్వీనర్ నిజ్జన రమేశ్ మాట్లాడుతూ… తెలంగాణ‌లో చదువు‌కున్న యువత బతుకులు రెంటికి చెడ్డ రేవడిలా తయారయ్యాయని అన్నారు. నాటికీ నేటికీ ఎలాంటి ఉద్యోగ కల్పన లేక యువత రోడ్ల పాలైందనీ అన్నారు. వారిని పట్టించుకునే నాదులు లేరని వాపోయారు. ఇప్పటికైనా ఉద్యోగాలను భర్తీ చేసి యువత బతుకులను బాగుచేయలని కోరారు. ఈ నెల 26న రాష్ట్ర కార్యాలయంలో నిరుద్యోగుల నిరసన దీక్షా చేపట్టనున్నట్టు తెలిపారు. దీనికి అనుబంధంగా అన్ని జిల్లా కేంద్రాల్లో దీక్షలు కొనసాగించాలని కోరారు. ఈ నెల 27 నుంచి అక్టోబర్1 వరకు నిర్వహించనున్న నిరుద్యోగుల శాంతి ర్యాలీని విజయవంతం చేసేందుకు ప్రచారంలో భాగంగా సిద్దిపేటకు వచ్చామని తెలిపారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 న నిరుద్యోగుల ఆత్మహత్యల నివారణకు హైదరాబాద్‌లో భారీ శాంతి ర్యాలీ నిర్వహించనున్నట్టు తెలిపారు. నిరుద్యోగులు భారీ ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

Advertisement

Next Story

Most Viewed